UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువభేరీ

నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్న పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచేందుకు సిద్ధపడుతున్నారు.

సంక్రాంతి తరువాత బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు సంబంధించి వారాహి ప్రచార రథంతో పాటు కాన్వాయ్ వాహనాలు సిద్ధమయ్యాయి. అటు యాత్ర షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ హైకమాండ్ ఉంది. దాదాపు 175 నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి? ఎటు నుంచి యాత్ర ప్రారంభించాలన్న దానిపై తుది కసరత్తు జరుగుతోంది. కొద్దిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ విముక్త ఏపీ అంటూ ఇప్పటికే పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీనే పవన్ టార్గెట్ చేసుకునే అవకాశముంది. దీంతో అటు వైసీపీ శ్రేణులు సైతం కలరవపాటకు గురవుతున్నాయి. ప్రచార రథం వారాహి విషయంలో ఎంత దుష్ప్రచారం చేయాలో చేసి అబాసుపాలయ్యారు. ఆ వాహనానికి తెలంగాణ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ అన్ని రకాల క్లీయరెన్స్ లు ఇచ్చేసరికి వారు షాక్ కు గురయ్యారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఓ మంచి రోజు వాహనానికి పూజ చేసి యాత్రకుసంబంధించి షెడ్యూల్ విడదల చేసే అవకాశముంది.

 

అంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా మరో కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టనున్నారు. యువభేరీ పేరిట ప్రజల ముంగిటకు వస్తున్నారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువభేరీ నిర్వహించనున్నారు. అటు తరువాత మిగతా 25 జిల్లాల్లోకూడా నిర్వహించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో బలమైన అభిమానుల ఓటు బ్యాంకు చెదిరిపోయిన తరుణంలో.. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా విద్యార్థులు, యువత జనసేనకు ఓటు వేయడమే కాకుండా మద్దతుగా నిలిపే ప్రయత్నంలో భాగంగా యువభేరీ నిర్వహిస్తున్నారు. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ యూత్ ను టార్గెట్ చేసుకొని చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్ వంటి వాటిపై గట్టిగానే పోరాటం చేశారు. వాటితోనే యువత భవిత ఆధారపడి ఉందని.. వాటిని సాధించడంలో నాటి చంద్రబాబు సర్కారు విఫలమైందని నమ్మించారు. తనకు అధికారం ఇస్తే అన్నీ చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కనీసం వాటి సాధనకు ప్రయత్నం కూడా చేయలేదు. ‘సరెండర్, సైలెంట్’తో నాలుగేళ్లు కాలం గడిపేశారు. అందుకే పవన్ జగన్ వైఫల్యాలను అజెండాగా చేసుకొని విద్యార్థులు, యువతను మేలుకొల్పనున్నారు. వారితో జనసేనకే ఓటు వేస్తామని హామీ తీసుకోనున్నారు.

అయితే పవన్ ఇంతలా దూకుడు పెంచడానికి కారణమేమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి ప్రతీ వారం ఏదో ప్రజోపయోగ కార్యక్రమంలో పవన్ .జనాలు ముందుకు వస్తున్నారు. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం మెడలు వంచి పనిచేయిస్తున్నారు. అయితే పవన్ విశాఖలో ప్రధాని మోదీని కలిసిన తరువాత స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అంతకంటే ముందే వైసీపీ పై పోరాటానికి బీజేపీ తగిన విధంగా సాయం చేయడం లేదని పవన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. అక్కడకు కొద్దిరోజులకే పవన్ కు ఢిల్లీ పెద్దల నుంచి సమాచారం వచ్చింది. ప్రధానిని విశాఖలో కలవాలని వర్తమానం అందింది. అయితే ప్రధానితో భేటీ తరువాతే చాలా కార్యక్రమాలకు పవన్ శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఎన్నికల వ్యూహాల్లో భాగమేనని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పవన్ వెనుక కచ్చితంగా బీజేపీ ఉందని నమ్మకంగా చెబుతున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !