ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూస్తున్నట్లు.. ఓ స్ట్రెయిట్ తమిళ సినిమా కోసం తమిళ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్లు.. భారతదేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ‘అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్’ విడుదల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ‘అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్’ ఎలాంటి సంచలనాల్ని సృష్టించబోతోంది.? అన్న విషయమై ప్రపంచ సినీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అవతార్‌కి షాకిచ్చిన పైరసీ.. అయితే, ‘అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్’కి పైరసీ షాక్ ఇస్తోంది. ఎలా బయటకు వస్తున్నాయో తెలియదుగానీ, ఈ సినిమాకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో దర్శనమిస్తున్నాయి. మొత్తంగా సినిమా అంతా లీక్ అయిపోయిందన్న ప్రచారమూ జరుగుతోంది. ‘ఏమంత అద్భుతంగా లేదు..’ అంటూ నెగెటివ్ రివ్యూలూ ఇచ్చేస్తున్నారు ఆ లీక్ అయిన సినిమాని చూస్తున్నవారు. ఇంతకీ, ‘అవతార్ ది వేవ్ ఆఫ్ వాటర్’ విడుదలకు ముందే లీక్ అయ్యిందా.? లీక్ అయితే, ఆ ఎఫెక్ట్ సినిమా మీద ఎంత వుండబోతోంది.?