UPDATES  

 చాలా రుచికరమైన డిష్…బటర్ చికెన్

చికెన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు.

అయితే నాన్​వెజ్​ ప్రియులను బటర్ చికెన్ అంటే ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలామందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అయితే ఇది చాలా రుచికరమైన డిష్. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ – 500 గ్రాములు (బోన్ లెస్)

* బటర్ – 250 గ్రాములు

* చాట్ మసాలా – 1 టేబుల్ స్పూన్

* కారం – 1 టీస్పూన్

* ఉప్పు – రుచికి తగినంత

* పెప్పర్ పౌడర్ – 1 టీస్పూన్

* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

* పెరుగు – 1/2 కప్పు

* చికెన్ మసాలా – 1 టీస్పూన్

* ధనియా పొడి – 1 టీస్పూన్

తయారీ విధానం

ముందుగా బోన్‌లెస్ చికెన్ ముక్కలను మెరినేట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని.. దానిలో పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నూనె, నిమ్మరసం, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపండి. దానిలో చికెన్ ముక్కలను వేసి బాగా కలిపి.. మ్యారినేట్ చేసుకోండి. 3 నుంచి 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచేయండి.

అనంతరం గ్రిల్ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేడి చేసి.. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత.. ఒక గిన్నెలోకి అన్ని ముక్కలను తీయండి. దానిపై వెన్న కరిగించి పోయండి. దానిపై చాట్ మసాలా చల్లుకోండి. ఉల్లిపాయ, నిమ్మకాయలతో సర్వ్ చేసుకుని.. హ్యాపీగా లాగించేయండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !