UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 క్రిస్మస్​కి​ బడ్జెట్ ట్రిప్​ … టాప్ 5 ప్లేస్​లు

ఉత్తమ క్రిస్మస్ వేడుకలను చూడాలనుకునేవారు మన ఇండియాలోనే పలు ప్రదేశాలను విజిట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

క్రిస్మస్​ వేడుకలను ఎంజాయ్ చేయాలంటే.. ఇండియాలో ఉన్న 5 ప్రాంతాలను కచ్చితంగా విజిట్ చేయవచ్చని సూచనలిస్తున్నారు.

మీ ఫ్రెండ్స్​తో ట్రిప్​కి వెళ్లాలన్నా.. ముఖ్యంగా క్రిస్మస్​ సెలబ్రేట్ చేసుకోవాలన్నా.. ఈ ఐదు గమ్యస్థానాలను మీకు మంచి అనుభవం ఇస్తాయి. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోల్‌కతా

కోల్‌కతా వాసులు క్రిస్మస్‌ను తన సొంత స్థానిక, సాంస్కృతిక పండుగలా జరుపుకుంటారు. సెయింట్ ఆండ్రూస్, సెయింట్ జాన్స్, సెయింట్ పాల్స్ కేథడ్రల్, డఫ్, సేక్రేడ్ హార్ట్ వంటి ఐకానిక్, ప్రసిద్ధ చర్చిలు అన్నీ మెరిసే లైట్లు, ఆడంబరమైన అలంకరణలతో ఆకట్టుకుంటుంది.

మార్కెట్ చుట్టూ ఉన్న లేన్‌లు క్రిస్మస్ చెట్టు అలంకరణలు, శాంటా దుస్తులను విక్రయించే స్థానిక విక్రేతలతో కళకళలాడుతున్నాయి. పార్క్ స్ట్రీట్ అందమైన లైట్లతో ఆకట్టుకుంటాయి.

ముంబై

ముంబై గొప్ప వలస చరిత్రను కలిగి ఉంది. క్రిస్మస్ వేడుకలను చాలా వైభవంగా, ప్రదర్శనతో జరుపుకుంటారు. కొలాబాలోని క్రాఫోర్డ్ మార్కెట్‌తో సహా అనేక ప్రసిద్ధ మార్కెట్‌లు.. శాంటా క్యాప్స్, క్రిస్మస్ చెట్లు, ఇతర అలంకరణలను కొనుగోలు చేయాలనుకునే వారికోసం ఇక్కడ స్టాల్స్ ఆకట్టుకుంటాయి.

మౌంట్ మేరీస్ బసిలికా, హోలీ నేమ్ కేథడ్రల్, ఆఫ్గన్ చర్చి, సెయింట్ థామస్ కేథడ్రల్, గ్లోరియా చర్చి వంటి.. చర్చిలు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తాయి.

గోవా

గోవాలోని చర్చిలు, గృహాలు అందమైన లైట్లు, పాయింసెట్టియా పువ్వులతో అలంకరిస్తాయి. చీకట్లో ఇవి మరింత అందంగా ఉంటాయి. క్రిస్మస్ టైమ్​కి మీరు గోవా వెళ్లాలనుకుంటే.. న్యూ ఇయర్​ కూడా మీరు ఇక్కడే ప్లాన్ చేసుకోవచ్చు.

బీచ్‌లలో పార్టీలు, బార్‌లలో కాక్‌టెయిల్‌లు, నైట్ మార్కెట్‌లలో క్రిస్మస్ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.

కేరళ

కేరళలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా చేస్తారు. స్థానిక విందులు, కేరింతలు, క్రిస్మస్ నాటకాలను మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఈ పండుగకు గుర్తుగా వీధులు, చర్చిలు, ఇళ్లను లైట్లతో, పువ్వులతో, ఇతర క్రిస్మస్ వస్తువులతో అలంకరిస్తారు.

క్రిస్మస్ కేకులు, శాంటా టోపీలు, పిల్లల కోసం మాస్కులు, కొవ్వొత్తులు, క్యాండీలు అందించే స్థానిక మార్కెట్‌లు పుష్కలంగా ఉంటాయి.

షిల్లాంగ్

షిల్లాంగ్ క్రిస్మస్ సందర్భంగా అనేక వినోద కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ పండుగకు, నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రతి వీధులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వెళ్లవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !