UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ‘ దారుణమైన ‘ వ్యాఖ్యలు చేసిన శ్రియా శరణ్ .

టాలీవుడ్ స్టార్స్ అందరితో జతకట్టిన హీరోయిన్ శ్రియా సరన్ తన లైఫ్ లో జరిగిన ఒక విషయాన్ని సీక్రెట్ గా ఉంచింది. శ్రియ 2018 లో ఆండ్రీ అనే బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుది. ప్రెగ్నెన్సీ టైం మొత్తం అసలు మీడియాకి కనిపించకుండా సీక్రెట్ గా ఉంచింది ఈ అమ్మడు. అయితే రీసెంట్గా అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చింది. తన కూతురు కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఒత్తిడితో గడపాలని అనుకోలేదు, ఆ సమయంలో ఎలాంటి వారైనా బరువు పెరుగుతారు. హీరోయిన్ అవడం వల్ల దాని సాధారణ విషయంగా చూడలేరు. అందుకే తాను ప్రెగ్నెన్సీ ఫోటోలను షేర్ చేయలేదని చెప్పుకొచ్చింది. తన ప్రేగ్నేన్సి వార్త బయటకు వస్తే మీడియా ఇంకా ఫ్యాన్స్ తనని ట్రోల్ చేస్తారు. బిడ్డ మీద ఫోకస్ చేస్తారు. వాటికి దూరంగా ఉండాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని ఆ టైంలో ప్రెగ్నెన్సీ అని చెప్పలేదని శ్రీయ చెప్పుకొచ్చింది.

సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాలపై మీడియా ఎంత ఉత్సాహం చూపిస్తుందో అందరికీ తెలిసిందే. సమాచారం ఇవ్వడం వరకు ఓకే కానీ వారి అభిప్రాయాలను వారిపై రుద్దినప్పుడే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఈ తలనొప్పులన్నీ ఎందుకని తన భర్తతో పాటే ఉంటూ ఒక్క ఫోటోను కూడా షేర్ చేయలేదు శ్రియ. కొందరు ఈమె చేసిన పని బాగుందని అంటున్నారు. Shriya Saran reveals that secret ప్రస్తుతం శ్రీయ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. ఇటీవల బాలీవుడ్ దృశ్యం 2 సినిమాలో నటించింది. ఈ సినిమాలో హీరోగా అజయ్ దేవగన్ నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ లో ఈ అమ్మడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చింది. పెళ్లై ఒక బిడ్డకు జన్మనిచ్చిన సరే శ్రీయ అందాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులను మెప్పిస్తుంది.

   TOP NEWS  

Share :

Don't Miss this News !