: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారంతో ముగిసింది. 15 వారాలు…దాదాపు 105 రోజులు సాగిన ఈ షోలో సింగర్ రేవంత్ టైటిల్ గెలిచాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే లో చిన్న ట్విస్ట్ చివరిలో చోటుచేసుకుంది. రేవంత్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు శ్రీహాన్ గెలుచుకున్నాడు. కానీ ₹40 లక్షల రూపాయల ఆఫర్ కి శ్రీహాన్… ఓకే చెప్పటంతో రేవంత్ విన్నర్ గా నిలిచాడు. దీంతో శ్రీహాన్ కి కాస్త గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కానీ డబ్బు పరంగా 40 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ పరిణామంతో ₹50 లక్షల ప్రైజ్ మనీలో రేవంత్ కి ₹10 లక్షలే దక్కాయి.అయినప్పటికీ బిగ్ బాస్ విజేతగా రేవంత్ గెలుచుకున్న మొత్తం…₹50 లక్షల రూపాయల పైనే ఉందని సమాచారం. విషయంలోకి వెళ్తే సీజన్ సిక్స్ ట్రోఫీతో పాటు ₹10 లక్షల ప్రైజ్ మనీ అందుకోవటం జరిగింది.
వీటితోపాటు సువర్ణభూమి వారి 605 గజాల ఫ్లాట్, ₹10 లక్షల విలువైన మారుతి సుజుకి బ్రేజా కార్ ప్రకటించారు. అయితే వీటి మొత్తం విలువ చూస్తే… ఒక్క సువర్ణభూమి ప్లాట్ ₹30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. Bigg Boss 6 Telugu revanth remuneration with winning prize money details ఇక కారుతో మొత్తంగా కలిపి చేస్తే రేవంత్ కి ₹50 లక్షలు ముట్టినట్టే అని అంటున్నారు. ఇక ప్రైజ్ మనీ విషయం పక్కన పెడితే 15 వారాల పారితోషకం విషయంలో రేవంత్ ఒక వారానికి ₹60 వేల నుంచి ₹80వేలు బీబీ టీం ఇవ్వడం జరిగిందట. దీంతో 15 వారాలకు గాను తొమ్మిది నుంచి ₹11 లక్షలు పైనే… అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకున్నాడట. మొత్తంగా చూసుకుంటే విన్నర్ ప్రైజ్ మనీ తో పాటు రెమ్యూనరేషన్ కలిపి ₹60 లక్షల పైనే…అందరికంటే ఎక్కువ రేవంత్ సంపాదించినట్లు ప్రచారం జరుగుతుంది.