UPDATES  

 తక్కువ ధరకే సూపర్ ఫోన్.. ఆవిష్కరించిన శాంసంగ్

స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ ఫోనును ఆవిష్కరించింది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్ కొనాలని భావించే మొబైల్ వినియోగదారులకు ఎంతో చౌకగా ఉంటుంది. రూ.8500తో 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోను తీసుకొచ్చింది. పైగా, మంచివేగంతో 128 జీపీ మెగా స్టోరేజ్‌ను కల్పించిది. 5 వేల ఎంఏహెచ్‌తో పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చింది. బడ్జెట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోను తీసుకొచ్చింది.
తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పైగా, ఈ స్మార్ట్ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఉచితంగా అందించనుంది. ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే, ఈ ఫోను పేరు మేరా ఎం 04. 8 జీబీ ర్యామ్, రోమ్ స్టోరేజీ 128 జీబీ, (1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంది). ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, బ్యాటరీ 5000 ఎంఏహెచ్, కెమెరా 13 ఎండీ డ్యూయల్ కెమెరా, 16.55 సెం.మీ స్క్రీన్ కలిగివుండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8500గా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు మార్కెట్‌లో మొదలయ్యాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !