UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బచ్చలికూర తిని HOSPITALలో చేరిన 9 మంది..

బచ్చలి కూర కారణంగా ఆస్ట్రేలియాలో కొందరు ఆసుపత్రిపాలయ్యారు. విషపూరితమైన బచ్చలి కూర తిన్నవారంతా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కోస్ట్‌కోకు చెందిన రివేరా ఫార్మ్స్ కంపెనీ బచ్చలికూర తిన్న తర్వాత తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన వారిలో లేనిది ఉన్నట్లుగా మతి భ్రమించడం, గుండె కొట్టుకునే రేటు పెరగడం, మసకమసకగా కనిపించడం వంటి లక్షణాలు ఉన్నాయని వారికి చికిత్స చేసిన ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కలుపు మొక్కల కారణంగా ఆ బచ్చలి కూర మొక్కలు కలుషితమై ఉంటాయని రివేరా ఫార్మ్స్ చెబుతోంది. మిగతా అన్ని ఉత్పత్తులు బాగానే ఉన్నాయని తెలిపింది. డిసెంబర్ 16 గడువు తేదీతో ఉన్న ఈ బ్రాండ్ బచ్చలికూరను తినడం సురక్షితం కాదని, ఆ ప్యాకెట్లను బయట పడేయాలని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.

బచ్చలి కూర తిన్న తర్వాత అసాధారణంగా అనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలని ప్రజలకు సూచించారు. ”ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. అయితే, కొంతమంది ఇంకా అనారోగ్యంతో ఉన్నారు. బచ్చలి కూర తిని ఆసుపత్రి పాలైనవారిలో కొందరికి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు భ్రమ కలుగుతోంది”అని పాయిసన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ డారన్ రాబర్ట్స్.. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తా పత్రికతో చెప్పారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వెంటనే తాము చర్యలు తీసుకున్నామని రివేరా ఫార్మ్స్ అధికార ప్రతినిధి చెప్పారు. ఆ కలుషిత బచ్చలి కూరను వెంటనే తమ షాపుల్లో నుంచి బయటపడేయాలని సూచించినట్లు వివరించారు. మిగతా ఎక్కడా ఇలా కలుషిత బచ్చలి తిని ఆసుపత్రి పాలైనట్లు తమకు సమాచారం అందలేదని ఆయన వివరించారు. ప్రస్తుతం బాధితులంతా సిడ్నీకి చెందినవారేనని ఎన్ఎస్‌డబ్ల్యూ హెల్త్ వెల్లడించింది. వెంటనే ఇతర రాష్ట్రాల్లోని అధికారులు కూడా అప్రమత్తం అయినట్లు పేర్కొంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !