ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇక ఇప్పుడు ఆమె ఏం మాట్లాడినా సరే ఆ మాటలు సెన్సేషనల్ గా క్రియేట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఇక ఆమె ఫస్ట్ టైం ఆల్ ఇండియా లెవెల్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పుకొచ్చింది. ఈ తరహాలో సోషల్ మీడియాలో సింపతి సంపాదించుకుంది సమంత. దీంతో యశోద సినిమాతో భారీ హిట్ ను అందుకుంది. అయితే ఆమె సినిమా ప్రమోషన్స్ టైం లో పలు టీవీ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన రీతిలో అక్కినేని హీరోలకు పరోక్షంగా కౌంటర్లు వేసింది. ఈ క్రమంలో ఆమె ఓ ఛానల్లో మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది.
తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్ చేసింది సమంత. లైఫ్ అంటే మనకు నచ్చినట్లు మనకు ఇష్టమైనట్లు బ్రతకాలని, ఎవరినో సంతోష పెట్టడానికి మనం ఏం పుట్టలేదని, ఒకరి కింద ఉండాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. Star heroine samantha comments on akkineni heroes అలాగే దేన్నైనా సరే తట్టుకుని నిలబడగలిగే స్టామినా ఉండాలని అప్పుడే మనం లైఫ్ లో ముందుకు వెళ్లగలుగుతాం అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అక్కినేని హీరోలకు సమంత గాటుగా జవాబు ఇచ్చిందంటూ సమంత ఫాన్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ తో కలిసి ఇష్క్ సినిమా లో నటించబోతుంది. ఇక యశోద సినిమా తర్వాత సమంత మరియు ,టైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమా అవ్వడం తో భారీగా అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకుంటారో లేదో వేచి చూడాలి.