ఈటీవీ జబర్దస్త్ నుండి ఇటీవలే హైపర్ ఆది ఎలిమినేట్ అయిపోయాడు. గతంలో కూడా హైపర్ ఆది జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి పోయాడు. కానీ ఆ సమయంలో మళ్లీ వచ్చాడు. కానీ ఈసారి ఆయన పూర్తిగా ఎలిమినేట్ అయినట్లే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తనకు తానుగా వెళ్లి పోయాడా లేదంటే మల్లెమాల వారు సాగనంపారా అనే విషయంపై క్లారిటీ లేదు. మొత్తానికైతే హైపర్ ఆది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసినట్లే అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇక హైపర్ ఆది తర్వాత జబర్దస్త్ నుండి మరికొంత మంది గుడ్ బై చెప్పబోతున్నారట. జబర్దస్త్ యొక్క పెద్ద పెద్ద స్టార్స్ కూడా బయటకు వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం కు చెందిన రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను ఇద్దరు కూడా వెళ్లిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సుడిగాలి సుధీర్ వెళ్లి పోయిన తర్వాత వారి టీమ్ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. ఆ మార్పుల విషయంలో రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను అస్సలు సంతృప్తిగా లేరని సమాచారం అందుతుంది. అందుకే వారిద్దరు కూడా జబర్దస్త్ ను వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే జబర్దస్త్ కి మరియు మల్లెమాల వారు నిర్వహించే Auto Ramprasad and Getup Srinu god bye to etv jabardasth ఇతర కార్యక్రమాలన్నింటికీ కూడా రాంప్రసాద్ మరియు గెటప్ శ్రీను గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. త్వరలో స్టార్ మా లేదా జీ తెలుగు ఛానల్లో ఒక భారీ కామెడీ షో మళ్లీ మొదలు కాబోతుందంట. ఆ కామెడీ షో కోసం వీరంతా రెడీ అవుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ ఇప్పటికే కమెడియన్స్ లేక వేల వేల పోతూ ఉంటే అత్యంత కీలకమైన హైపర్ ఆది ఇప్పటికే వెళ్ళి పోయాడు మరియు రాంప్రసాద్ ఇంకా గెటప్ శ్రీను కూడా వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.