UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 ప్రదీప్ కాబోయే పెళ్ళాం ఎవరో తెలిస్తే .. ?

తెలుగు ప్రేక్షకులలో చాలామందికి ప్రదీప్ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఫిమేల్ యాంకర్స్ లో సుమకు ఎంత క్రేజ్ వుందో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కు అంత క్రేజ్ ఉంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ప్రదీప్ ఇప్పటికీ తన స్టైల్ మార్చకుండా అదే స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పద్ధతి గల యాంకర్ అని అనిపించుకున్నాడు. ఇక ప్రదీప్ కి సినిమాలలో కూడా ఛాన్సులు వస్తున్నాయి. గతేడాది ప్రదీప్ హీరోగా ‘ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ‘ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రభాస్. అదేవిధంగా బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రదీప్ నే అంటారు. బ్యాచిలర్ గా పేరు తెచ్చుకున్న ప్రదీప్ పెళ్లి చేసుకోవాలనేది అభిమానుల కోరిక. కొన్ని సంవత్సరాలుగా ప్రదీప్ పెళ్లి వార్త ఎప్పుడు చెప్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక, ప్రదీప్ పెళ్లి పై రూమర్స్ కూడా వచ్చాయి. వాటన్నిటిపై ప్రదీప్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. Anchor Pradeep marriage News యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రదీప్ డిసెంబర్ 26 ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య. ఆమె పలువురు స్టార్ట్ సెలబ్రిటీస్ కి డిజైనర్ గా వర్క్ చేస్తుంది. వీళ్ళిద్దరూ చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని, వీళ్ళ ప్రేమ పెళ్ళి వరకు వెళ్లిందని అంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరి మతాలు వేరైనప్పటికీ వాళ్లు సంతోషంగా ఉండాలని పెద్దలు వారి వివాహం చేస్తున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !