పవన్ కళ్యాణ్ మూడో భార్య రష్యా కు చెందిన వ్యక్తి అనే విషయం తెల్సిందే. అలాగే ఆమె క్రిస్టియన్ అని కూడా అందరికి తెలుసు. ప్రతి క్రిస్మస్ కి అన్నా లెజ్నోవా రష్యాకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాన్ కూడా భార్య మరియు పిల్లలతో క్రిస్మస్ వెకేషన్ కు రష్యా కు వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం క్రిస్మస్ కు పవన్ కళ్యాణ్ రష్యా వెళ్లలేక పోతున్నాడట. షూటింగ్స్ మరియు జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ వెళ్లేందుకు నిరాకరించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. క్రిస్మస్ హాలీడేస్ కు రష్యాకు వెళ్లేందుకు పవన్ కళ్యాన్ నిరాకరించడంతో ఆయన భార్య అసంతృప్తి వ్యక్తం చేసిందట. అన్నా లెజ్నోవా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తో విభేదించిందని కూడా వారి సన్నిహితులు చెబుతున్నారు.
ఎక్కువ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని సర్ధుకు పోతూ ఉండే అన్నా లెజ్నోవా ఈ సారి మాత్రం తన పంథం నెగ్గించుకునేందుకు పవన్ కళ్యాణ్ రష్యా రావాల్సిందే అన్నట్లుగా డిమాండ్ చేసిందట. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి అంటున్నారు. Pawan Kalyan and his 3rd wife Anna Lezhneva Family feuds ఈ ప్రచారం పై సోషల్ మీడియాలో పవన్ కళ్యాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ మరియు అన్నా లెజ్నోవాల మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు నూటికి రెండు వందల శాతం అబద్దం. అసలు అలాంటి ఒక ప్రస్థావన కూడా వారి మధ్య రాలేదు అంటూ వారు బలంగా వాదిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి మీడియాలో కొత్తగా వస్తున్న ఈ వార్తలతో అభిమానులు ఒకింత ఆందోళనతో ఉండగా.. ఆయన సన్నిహితులు మాత్రం పవన్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన పని లేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.