‘లిక్కర్ క్వీన్’ అంటూ సోషల్ మీడియా వేదికగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌పై ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా స్పందించిన సంగతి తెలిసిందే. ’28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదు..’ అంటూ కవిత ట్వీటేశారు. కాగా, కవిత ట్వీటుపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి, ‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాంలో వున్నది నిజం. జైలుకు వెళ్ళడం ఖాయం. నిన్ను, మీ అన్న మీ నాయనా ఎవరూ కాపాడలేరు..’ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీటాస్త్రం సంధించారు.
ఎమ్మెల్సీ కవితపై రాజగోపాల్ రెడ్డి సెటైర్మునుగోడులో విష ప్రచారం చేశారు.. ‘మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కొనలే కేటీయార్ (ట్విట్టర్ టిల్లు) ఇంకా మీ పార్టీ నాయకులు పారదర్శకంగా, టెండర్ ద్వారా వచ్చిన 18 వేల కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విష ప్రచారం చేసి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతిమయమైన మీ కుటుంబం అంతా జైలుకు వెళ్ళడం ఖాయం..’ అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీటేయడం గమనార్హం. అంటే, మునుగోడు బై పోల్‌లో బీజేపీ ఓడిన నేపథ్యంలోనే, గులాబీ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై కేసులు నమోదవుతున్నాయా.? రాజగోపాల్ రెడ్డి ట్వీట్లలోని ఆంతర్యమిదేనా.?