UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బ్రేకింగ్ కాసేపట్లో నటి జయప్రద అరెస్ట్..??

నటి జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో ఆడి పాడి చిందులేసింది. అప్పట్లో జయప్రద స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును పొందింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి పేరును సంపాదించుకుంది. ఇక జయప్రద సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా రాణించింది. తాజాగా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి జయప్రద గెస్ట్ గా రానుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. జయప్రద కి కోర్టు భారీ షాక్ ఇచ్చిందని తెలుస్తుంది. ఈమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంటీ ను జారీ చేసినట్లు తెలుస్తోంది.

అసలు వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ ప్రత్యేక కోర్టు ఈమె పై నాన్ బెయిలబుల్ వారెంటీని జారీ చేసింది. దీనికి కారణం జయప్రద ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఈమె పై రెండు కేస్ లు నమోదు అయ్యాయట. అయితే వీటికి జయప్రద హాజరు కాలేదట. దీంతో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ నీ జారీ చేసింది. ఇందుకు జయప్రద మంగళవారం కోర్టు విచారణకు హాజరు కావాలని Jaya Prada arrest in that matter రాంపూర్ సుపరిడెంటెంట్ ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 9న వాయిదా వేసింది. జయప్రద పై రెండు కేసులు ఉన్నాయి. మొదటి కేసు రాంపూర్ గ్రామీణ పరిధిలో జరిగిన మహాసభకు సంబంధించిన కేసు ఏప్రిల్ 18, 2019 న నమోదు అయింది. ఇక రెండవ కేసు స్వర అనే పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఏప్రిల్ 19, 2019 న నమోదయింది. అయితే ఈ రెండు కేసులకు సంబంధించి తాజాగా జయప్రద న్యాయస్థానానికి హాజరు కాకపోవడంతో కోర్టు ఆమెపై నాన్ వెలబుల్ వారంటీని జారీ చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !