UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 వారాహి కోసం కదిలివచ్చిన పవన్ కళ్యాణ్

‘వారాహి’ కోసం పవన్ కళ్యాణ్ కదిలివచ్చారు. ఈ వారాహినే కాదు.. ఈ వాహనంతోపాటు మరో 6 వాహనాలు కూడా పవన్ వెంట ప్రచారంలో పాల్గొననున్నాయి. వీటన్నింటి కోసం పవన్ కళ్యాణ్ తనే వచ్చారు. హైదరాబాద్ ఖైరాతాబాద్ ఆఫీస్ కు ఉదయం పూట వస్తే ప్రజల సందోహాన్ని తట్టుకోలేరని సాయంత్రం రమ్మన్నారు. రవాణా కమిషనర్ కోరిక మేరకు సాయంత్రం వచ్చిన పవన్ ఆ 6 వాహనాల రిజిస్ట్రేషన్ ను దగ్గరుండి చేశారు. ఫొటోలు దిగి, డిజిటల్ సైన్ చేసి వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఏపీ సర్కార్ పవన్ వాహనాలకు నిబంధనల పేరిట అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. తెలంగాణ సర్కార్ నెత్తిన పెట్టుకుంది. సపరేట్ గా పవన్ ను ఆహ్వానించి ఆ రవాణా కమిషనర్ ఎదురేగి వచ్చి మరీ పవన్ ను సాగనంపారు. ఇదే ఏపీ,తెలంగాణకు ఉన్న తేడా. పవన్ కు లభిస్తున్న గౌరవం. తన యాత్ర కోసం పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా.. ఎంతదాకా అయినా సాగడానికి రెడీ అయ్యారు. ఏపీ సీఎం జగన్ అడ్డంకులు సృష్టించినా కూడా తన వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పవన్ షాకిచ్చారు. Pawan Kalyan Visited Khairatabad RTO Office ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ఆయన బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఆ ఏర్పాట్లలో హైకమాండ్ ఉంది. ఇంతలో పవన్ యువభేరీ కార్యక్రమాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జనవరి 12 శ్రీకాకుళం జిల్లా రణస్థంలో తొలి యువభేరీ నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకొని నిర్వహిస్తున్న యువభేరీలో పవన్ మంచి మెసేజ్ పంపించబోతున్నారు.

గత ఎన్నికల్లో లక్షలాది మంది యువత వచ్చినా.. వారు జనసేన ఓటర్లుగా నిలబడలేకపోయారు. అప్పడున్న రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి ఎత్తుగడలతో చాలావరకూ ఓట్లు కన్వెర్ట్ అయిపోయాయి. అందుకే ఈసారి జాగ్రత్తపడిన పవన్ ముందుగానే మేల్కొన్నారు. ఇప్పటికే వారికి పలురకాలైన సూచనలు చేశారు. ఈసారి స్ట్రయిట్ గానే యువకులు, విద్యార్థులకు చెప్పి జనసేనకు అండగా నిలవాలని పిలుపునివ్వనున్నారు. మరోవైపు కౌలురైతు భరోసా యాత్ర దాదాపు అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఒక్క ఉత్తరాంధ్రలో తప్ప. మొన్నటికి మొన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కౌలురైతుల కుటుంబాలకు సాయం అందించిన సంగతి తెలిసిందే, పెండింగ్ లో ఉన్న ఉత్తరాంధ్రలో కూడా సాయం అందించాలని పవన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ వెల్లడి కానుంది. మరోవైపు నిలిచిపోయిన జనవాణి కార్యక్రమ నిర్వహణపై కూడా కేంద్ర కార్యాలయం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. విశాఖలో జనవాణి కార్యక్రమానికి పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం పవన్ ను అడ్డుకోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. అయితే వరుసగా ఉత్తరాంధ్రలో పవన్ గడపనున్నారు. యువభేరీ, కౌలురైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి బస్సు యాత్రకు పవన్ సిద్ధం కానున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !