UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 తెలంగాణలో చంద్రబాబు మంత్రం

స్వకార్యం.. స్వామికార్యం రెండూ.. నెరవేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు కొత్త మంత్రం వేశారు. బీజేపీతో దోస్తీ కోసం ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ‘అపకారికి ఉపకారం’ అన్న చందంగా ఏపీలో తన ఓటమికి కారణమైన బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో ఉపకారం చేయాలని చూస్తున్నారు. తద్వారా ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో సాయం కోరుతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ సమయంలో తన క్యాడర్‌ సపోర్టు ఇప్పించి ఉడతాభక్తి చాటుకునే ఆలలోచన బాబుకు వచ్చింది. ఈ ఉడతా భక్తి సాయానికి.. ఏపీలోనూ తాను అధికారంలోకి రావడానికి బీజేపీ ఉడతా భక్తిసాయం ఆశిస్తున్నారు చంద్రబాబు. Chandrababu ఘర్‌ వాపసీ పాలసీ.. బీజేపీతో దోస్తీ కోసం తెలంగాణలో ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే చర్యలు చేపట్టారు చంద్రబాబు. తెలంగాణలో పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఖమ్మంలో పర్యటించారు. భారీ సభ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ అభిమానులు కూడా తరలివచ్చారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి.

రాష్ట్రంలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని సంచలన వ్యాఖ్య చేశారు. ఇదే సమయంలో ఆయన ఘర్‌ వాపసీ పాలసీ ప్రకటించారు. పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీడీపీలోకికి రావాఆలని పిలుపునిచ్చారు. గతంలో అనేక మంది నాయకులు టీడీపీ తరఫున గెలిచారని.. అయితే వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లారని చెప్పారు. ఎందుకు వెళ్లారు.. అని తాను అడగబోనని చెప్పిన చంద్రబాబు పార్టీ అవసరం అనుకునే నేతలంతా తిరిగి రావాలని కోరాడం చర్చకు దారితీసింది. కాసాని జ్ఞానేశ్వర్‌ వంటి నేతలను తయారుచేసి తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించి.. పూర్వ వైభవం తీసుకొద్దామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. వాపస్‌ వచ్చేదెవరు? రాబోయే రోజుల్లో టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేద్దామన్న చంద్రబాబు పిలుపుతో పార్టీని వీడిన వారు తిరిగి వస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఏ నాయకుడు అయినా.. పార్టీ మారారు అంటే.. వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమేననేది అందరికీ తెలిసిందే. ఈ రెండు అంశాలను ఫుల్‌ ఫిల్‌ చేసేలా టీడీపీ ఎదుగుతుందని అనుకున్నా.. వారిలో చంద్రబాబు నమ్మకం కలిగించినా.. చంద్రబాబు ప్రత్యేకంగా పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. వారే వస్తారు. ఈ దిశగా పడాల్సిన పునాదులు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !