UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 గొడౌన్స్ ల్లో ఉద్యోగులు.. వైసీపీ ఆఫీసులకు కాస్ట్ లీ ప్లేస్ లు..

అయిన వారికి ఆకులో.. కానివారికి కంచంలో అన్నం పెట్టినట్టుంది ఏపీలో వైసీపీ సర్కారు దుస్థితి. ఉద్యోగులు, ఉపాధ్యాయులంటేనే ప్రభుత్వానికి గిట్టడం లేదు. వారికి రావాల్సిన అలవెన్స్ లు, రాయితీలు అందించడం లేదు. ఇప్పుడు ఏకంగా జీతాలే అందించడం లేదు. జీతాలు ఇవ్వండి మహా ప్రభో అంటూ వారు రోడ్లెక్కాల్సిన దుస్థితి. న్యాయస్థానాన్ని ఆశ్రయించి జీతాలు దక్కించుకోవాల్సిన దౌర్భగ్య స్థితి ఏపీలో ఉంది. జిల్లాలను విడగొట్టి దాదాపు ఏడాది సమీపిస్తోంది. 13 జిల్లాను కాస్తా 26 జిల్లాలుగా మార్చేశారు. పాలనా సౌలభ్యానికి అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. అయితే పాలన అందించాల్సిన ఉద్యోగులు, సిబ్బందికి మాత్రం సరైన కార్యాలయాలు ఏర్పాటుచేయలేదు. వసతులు కల్పించలేదు. చిన్నిచిన్న గొడౌన్ లో సర్ధుబాటు చేశారు. ఇప్పటికీ వాటిలోనే అవి కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. కనీసం శాశ్వత భవనాల నిర్మాణం పై దృష్టిపెట్టలేదు. కనీసం వాటికి భూములు కూడా సేకరించలేదు. కానీ వైసీపీ కార్యాలయాలకు మాత్రం భూములు కేటాయించుకుంటున్నారు. నిర్మాణాలు కూడా చేసుకుంటున్నారు. AP Govt Employees దాదాపు కొత్త జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల ఏర్పాటుకు హైకమాండ్ నిర్ణయించుకుంది. రిచ్ గా ఏర్పాటుచేయాలని భావిస్తోంది. వెయ్యి,.రెండు వేలకు ఎకరాల కొలదీ భూమిని లీజుకు తీసుకుంంది. యంత్రాంగం కూడా దీనికి బాగానే సహకరిస్తోంది. చివరకు ప్రజా రవాణకు చెందిన ఆర్టీసీ భూములను సైతం కేటాయిస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పార్టీ ఆఫీసులకు భూముల కేటాయింపులో ప్రభుత్వం ఇష్జారాజ్యంగా వ్యవహహరిస్తోంది.

అధికారులు కనీస నిబంధనలు పాటించడం లేదు. వందల కోట్ల రూపాయల భూములను వైసీపీ పరం చేస్తున్నారు. కొత్త జిల్లాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. ఏదో పేపర్ల మీద పేర్లు రాసినట్టు ఉమ్మడి జిల్లాలను అడ్డగోలుగా విభజించారు. అవసరాల కోసం పేర్లు పెట్టి వదిలేశారు. దీంతో గోదాములు, ఇరుకుగా ఉన్న భవనాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోంది. అదే ఉంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాలను పూర్తిచేయాలి. కానీ అలా కాకుండా ప్రజలు తమకు అంతులేని విజయం అందించారు కదా అని ప్రజలు కట్టే పన్నులు, ప్రభుత్వ ఆస్తుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇష్టరాజ్యంగా ఖర్చుపెడుతున్నారు. ఎడాపెడా అన్నింటికీ వాడేస్తున్నారు. ప్రభుత్వ భూములను తమకు ఇష్టమొచ్చినట్టు తాకట్టు పెడుతున్నారు. అమ్మకాలు చేస్తున్నారు. AP Govt Employees ఇప్పుడు భూములను వైసీపీ పార్టీ కార్యాలయాలకు కట్టబెడుతున్నారు. జగన్ వ్యాపారసంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూర్చుతున్నారు. మీరు ఎలా ఉంటే మాకెందుకు మా పార్టీ పది కాలాల పాటు ఉండాలంటే కార్యాలయాలు ఉండాలి కదా? అని వితండవాదం చేస్తున్నారు. వినాసకాలే విపరీత బుద్ధి అన్నట్టు వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టి అసలు సిసలు రాజకీయాన్ని ఏపీ ప్రజలకు చూపిస్తున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !