UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వైసీపీకి షాకిస్తూ టీడీపీలోకి పీకే

ఒకే చోట పనిచేయడం కొందరికి ఇష్టముండదు. అందుకే చాలా మంది స్థాన చలనానికి ఇష్డపడతారు. కొందరు అప్పర్ పొజిషన్ కోసం సంస్థలను మారుతుంటారు. సాఫ్ట్ వేర్ రంగంలోకి వచ్చిన తరువాత ఈ తరహా మార్పులు అధికమయ్యాయి. ఇతర రంగాలకు విస్తరించాయి. అటు రాజకీయాల్లో కూడా ఇప్పుడదే కనిపిస్తోంది. ప్రాంతీయ వాదులు.. జాతీయ వాదులుగా మారిపోతున్నారు. జాతీయవాదాన్ని పరితపించే వారు ప్రాంతీయ పార్టీల్లో చేరుతున్నారు. దానికి రకరకాల కారణాలు చూపి సమర్థించుకుంటున్నారు. అంతెందుకు ఎన్నికల వ్యూహకర్తలు సైతం వేర్వేరు సైద్ధాంతిక విభేదాలుండే పార్టీలకు పనిచేస్తున్నారు. 2014లో ప్రధాని మోదీ గెలుపునకు పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. గోవాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి వ్యూహాలు పన్నారు. నాయకులే రంగులు మార్చుతున్నారు. వారికి ఐడియాలజీ ఇచ్చే మేము తక్కువ కాదన్నట్టు వారూ వ్యవహరిస్తున్నారు. Shantanu Singh ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీకి వ్యూహకర్తలు ఉన్నారు. ప్రత్యేక బృందాలే పనిచేస్తున్నాయి. వైసీపీకి రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీమ్ పనిచేస్తుండగా.. టీడీపీకి రాబిన్ శర్మ ఆధ్వర్యంలో షోటైమ్ కన్సెల్టింగ్ టీమ్ పనిచేస్తోంది. అయితే ఈ% రెండు టీమ్ లు ఒకప్పుడు ప్రశాంత్ కిశోర్ దగ్గర పనిచేసేవే. అయితే పీకే వ్యూహకర్త నుంచి కాస్తా రాజకీయ నాయకుడిగా మారారు. రాజకీయాల్లో బీజీ అయిపోయారు. అటు పీకే కింద పనిచేసిన వారంతా స్వాతంత్రంగా పనిచేసుకోవడం ప్రారంభించారు, సొంత ఏజెన్సీలను పెట్టుకొని వివిధ పార్టీల విజయం కోసం పనిచేస్తున్నారు.

Shantanu Singh అయితే సడెన్ గా వైసీపీ ఐ ప్యాక్ టీమ్ లో పనిచేస్తున్న కీలక సభ్యుడు ఒకరు గోడ దూకేశారు. రాబిన్ శర్మ ఆధ్వర్యంలోని షోటైమ్ టీమ్ లో డైరెక్టర్ హోదాలో చేరిపోయారు. అయితే ఒక్కసారి ఆయన ప్లేటు ఫిరాయించడం వెనుక పెద్ద కథే నడిచినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ విజయమే లక్ష్యంగా ఐ ప్యాక్ టీమ్ పనిచేస్తోంది. ఆ బృందం నుంచి కీలక వ్యక్తి చేజారిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐ ప్యాక్ టీమ్ కు చెందిన శంతన్ సింగ్ సడెన్ గా రాబిన్ శర్మ గూటికి చేరారు. ఆ టీమ్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోల్ మేనేజ్ మెంట్ కు శంతన్ సింగ్ ను వినియోగించుకోవాలని రాబిన్ శర్మ చూస్తున్నారు. శంతన్ ఐ ప్యాక్ లో ఉండేటప్పుడు పొలిటికల్ వింగ్ చూసేవాడు. పీకే వెళ్లిపోయిన తరువాత రుషిరాజ్ సింగ్ కు కుడిభుజంగా ఉండేవాడు. ఐఐటీ కాన్పూర్ పూర్వపు విద్యార్థి. సింగపూర్ లోని లీకాన్ యీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇండియన్ పాలిటిక్స్, అనాలసిస్ లో ముందంజలో ఉండేవారు. అందుకే పీకే టీమ్ అయిన ఐప్యాక్ లో చేరారు. మంచి పొజిషన్ లో ఉండగానే ఇప్పుడు ఆ టీమ్ కు రాజీనామా చేశారు.. ఎక్కువ కాలం ఆయన వైసీపీకి చేసివుండటంతో ఆ పార్టీ అనుసరిస్తోన్న వ్యూహాలు, బలహీనతలను తెలుస్తాయనే ఉద్దేశంతో టీడీపీ శంతన్ కు ఆహ్వానం పలికినట్టు ప్రచారం జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !