UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 పెళ్లి ముడితో ఒక్కటైన అరుదైన ప్రేమ జంట.!

‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి, అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదో అందమైన ప్రేమ కథ. సూపర్ హిట్టు సినిమా. అచ్చు ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మాదిరే అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ తెలుగమ్మాయ్. తెలంగాణాలోని శామీర్ పేటకు చెందిన మేఘన,న్యూయార్క్‌కి చెందిన గ్రేగారీకి గత 26 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్ర ప్రేమకు ఎల్లలు లేవు సుమా.! ఈ గ్యాప్‌లో ఇద్దరూ ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు.

పెళ్లి చేసుకుని జీవితాంతం ఒక్కటిగా బతకాలనుకున్నారు. తల్లితండ్రులను ఒప్పించి తమ ఈ ఎల్లలు లేని ప్రేమకు పెళ్లి ముడి వేసి, బంధాన్ని మరింత పదిలం చేసుకున్నారు. దూరమే కాదు, భాషా సంస్కృతీ సాంప్రదాయాలను కూడా గెలిచుకుని ఒక్కటైంది ఈ ప్రేమ జంట. ఈ ప్రేమపెళ్లిని బంధు మిత్రులంతా ఆశీర్వదించారు. గ్రేగారి లాంటి అబ్బాయ్ తమ ఇంటి అల్లుడు అయినందుకు మేఘన తల్లితండ్రులు తమ అదృష్టంగా భావించి మురిసిపోతున్నారు. ఇక, మేఘన సంతోషానికి అవధుల్లేవ్. గ్రేగారీ చాలా చాలా మంచి వ్యక్తి అని చెబుతోంది. అలాగే, మేఘన కూడా తన జీవితంలోకి రావడం తాను చేసుకున్న అదృష్టం అనీ గ్రేగారీ చెబుతున్నాడు. చూశారా.! ప్రేమకు కులం, మతమే కాదు, ఎల్లలు కూడా లేవని ఈ జంట మరోసారి నిరూపించింది.A

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !