UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 : సన్నీకి మరణ బెదిరింపులు..

సన్నీ లియోన్ ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్‌లో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు కెరీర్ ప్రారంభంలో అడల్ట్ చిత్రాల్లో నటించింది. ఎంతలా తనే నిర్మించి దర్శకత్వం వహించిన అశ్లీల చిత్రాలకు మంచి డిమాండ్ ఉండేది. అయితే 2012లో అడల్డ్ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా వైదొలిగి చిత్రసీమలోకి అరంగేట్రం చేసింది. అయితే అడల్ట్ కెరీర్ ప్రారంభంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చేవని, ముఖ్యంగా భారత్ నుంచి అధికంగా వచ్చేవని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకానొక సమయంలో ఇంక భారత్ రాకూడదని అనుకున్నానని తెలిపింది. “నా కెరీర్ ప్రారంభంలో ద్వేషపూరిత మెయిల్స్, చంపేస్తామనే బెదిరింపులు ఎన్నో వచ్చేవి. దీంతో ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని భావించి.. భారత్‌కు భవిష్యత్తులో వెళ్లేందుకు అవకాశమే లేదని అనుకున్నాను. అప్పుడు చాలా భయపడ్డాను” అని సన్నీ లియోన్ స్పష్టం చేసింది. 19-20 ఏళ్ల వయస్సులో అలాంటి బెదిరింపులు వస్తే అవి తీవ్రంగా ప్రభావితం చేస్తాయని సన్నీ పేర్కొంది.

“ఆ బెదిరింపులు వచ్చినప్పుడు నా వయస్సు 19-20 సంవత్సరాలు ఉంటాయి. ఆ సమయంలో మిమ్మల్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అదే ఇప్పుడు అయితే అంత ఉండదు. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నన్ను గైడ్ చేయడానికి కూడా ఎవరూ ఉన్నట్లు అనిపించేలేదు. ఏం కాదు.. ధైర్యంగా ఉండు.. నిన్ను ద్వేషించేవారి గురించి బాధపడకు అని సపోర్ట్ చేసేవాళ్లు కరవయ్యారు. ద్వేషపూరిత కామెంట్స్, ట్రోల్స్ ఎదుర్కోవడం అదే మొదటి సారి.” అని సన్నీ లియోన్ తెలిపింది. సన్నీ లియోన్ అసలు పేరు కరన్‌జీత్ కౌర్. ఆమె 2012లో పూజా భట్ రూపొందించిన జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహేలీ లీల, మస్తీజాదే లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే స్పోర్ట్స్ విల్లా ఎక్స్4 అనే రియాల్టీ డేటింగ్ షోను హోస్ట్ చేస్తోంది సన్నీ. 2011లో డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్నీ.. అడల్ట్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్‌లో స్థిరపడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కవల మగపిల్లలు సరోగసీ ద్వారా 2018లో జన్మనివ్వగా.. అంతకుముందు 2017లో నిషా అనే బేబీ గర్ల్‌కు జన్మనిచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !