UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 గాంధారిగా హన్సిక – ఫస్ట్‌టైమ్ డ్యూయల్ రోల్‌

ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది హన్సిక. ప్రియుడు సొహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. జైపూర్‌లో వైభవంగా హన్సిక, సొహైల్ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి పనులతో ఇన్నాళ్లు బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ తిరిగి సినిమాలపై దృష్టిసారించింది. హన్సిక కథానాయికగా గాంధారి పేరుతో తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ హారర్‌ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఢీ గ్లామర్ లుక్‌లో హన్సిక కనిపిస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో హన్సిక ద్విపాత్రాభినయం చేయబోతున్నది. డ్యూయల్ రోల్‌లో హన్సిక కనిపించడం ఇదే తొలిసారి. కణ్ణన్ దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం హన్సిక తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి, 105 మినట్స్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలో లేడీ ఓరియెంటెడ్ కథాంశాలతోనే రూపొందుతోన్నాయి. గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న హన్సిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టిసారిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !