తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు మరో సారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడంతో వివాదాస్పతుడైన శ్రీనివాసరావు తాజాగా కరోనా వ్యాప్తి తగ్గించింది ఏసు ప్రభువు అంటూ వ్యాఖ్యలను చేశారు. ఏసు ప్రభు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని లేదంటే ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయ్యేవి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొత్తగూడెంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నర సంవత్సరాల నుండి కోవిడ్ మానవ జాతి మనగడకు ప్రశ్నార్ధకంగా మారింది. ఆ మానవ జాతి హానికరమైన కోవిడ్ ని ఏసు ప్రభు కృపతో తరిమి కొట్టారు అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏసు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని ఆయన అన్నారు. మంచిని ఆచరించాలని.. మంచిని ప్రేమించాలని.. మంచిని గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. ఒక ఐఏఎస్ అయిన శ్రీనివాసరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారంను రేపుతున్నాయి.