UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 అమెరికా అబ్బాయ్, తెలంగాణా అమ్మాయ్..! పెళ్లి ముడితో ఒక్కటైన అరుదైన జంట.

‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి, అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదో అందమైన ప్రేమ కథ. సూపర్ హిట్టు సినిమా. అచ్చు ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల మాదిరే అమెరికా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ తెలుగమ్మాయ్. తెలంగాణాలోని శామీర్ పేటకు చెందిన మేఘన, న్యూయార్క్‌ కి చెందిన గ్రేగారీకి గత 26 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. పవిత్ర ప్రేమకు ఎల్లలు లేవు సుమా.! ఈ గ్యాప్‌లో ఇద్దరూ ఒకరిని ఒకరు బాగా అర్ధం చేసుకున్నారు.

పెళ్లి చేసుకుని జీవితాంతం ఒక్కటిగా బతకాలనుకున్నారు. తల్లితండ్రులను ఒప్పించి తమ ఈ ఎల్లలు లేని ప్రేమకు పెళ్లి ముడి వేసి, బంధాన్ని మరింత పదిలం చేసుకున్నారు. దూరమే కాదు, భాషా సంస్కృతీ సాంప్రదాయాలను కూడా గెలిచుకుని ఒక్కటైంది ఈ ప్రేమ జంట. ఈ ప్రేమ పెళ్లి ని బంధు మిత్రులంతా ఆశీర్వదించారు. గ్రేగారి లాంటి అబ్బాయ్ తమ ఇంటి అల్లుడు అయినందుకు మేఘన తల్లితండ్రులు తమ అదృష్టంగా భావించి మురిసిపోతున్నారు. ఇక, మేఘన సంతోషానికి అవధుల్లేవ్. గ్రేగారీ చాలా చాలా మంచి వ్యక్తి అని చెబుతోంది. అలాగే, మేఘన కూడా తన జీవితంలోకి రావడం తాను చేసుకున్న అదృష్టం అనీ గ్రేగారీ చెబుతున్నాడు. చూశారా.! ప్రేమకు కులం, మతమే కాదు, ఎల్లలు కూడా లేవని ఈ జంట మరోసారి నిరూపించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !