UPDATES  

 పాలకూరతో వడలు.. ఆరోగ్యానికి మేలు.

కేవలం కొన్ని పదార్థాలు ఉంటే చాలు.. ఆరోగ్యకరమైన పాలకూర వడలను హ్యాపీగా చేసుకుని లాగించేయవచ్చు. పాలకూర, మెంతిఆకులు, శనగపప్పుతో చేసే ఈ వడలు మీకు మంచి టేస్ట్​ని అందిచడమే కాకుండా.. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మరి వీటిని ఎలా తయారు చేయాలి? వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు * శనగపప్పు – 1 1/2 కప్పు (4 గంటల ముందు నానబెట్టాలి) * పాలకూర – 1 కప్పు * పచ్చిమిర్చి – 2-3 * అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ * కారం – 1 టీ స్పూన్ * మెంతి ఆకులు – 1 టీస్పూన్ * డ్రై మ్యాంగో పొడి – 1 టీస్పూన్ * సాల్ట్ – తగినంత * జీలకర్ర – 1 టీ స్పూన్ పాలక్ వడ తయారీ విధానం నానబెట్టిన శనగ పప్పును చిక్కగా పేస్ట్ అయ్యే వరకు రుబ్బుకోవాలి. పేస్ట్ మిగిలిన అన్ని పదార్థాలు వేసి.. బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీరు వేయండి. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని.. ఒక్కొక్కటిగా వడలుగా ఒత్తి.. కడాయిలో నూనెలో డీప్ ఫ్రై చేయండి. వీటిని మీరు కెచప్, పుదీనా లేదా చింతపండు చట్నీతో లాగించేయవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !