UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 రాజకీయ దూకుడు పెంచిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌

వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఏపీలో రాజకీయ దూకుడు పెంచిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేనాని రణానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవద్దన్న ఆలోచనలో ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వ్యతిరేకులందరినీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అభిమానులను ఓటర్లుగా మార్చుకునే ప్రణాళిక చేపట్టారు. పెద్దపెద్ద హీరోలు అసూయ పడే అభిమానులు ఉన్న పవన్‌.. గత ఎన్నికల్లో అభిమానులు ఓట్లు వేయలేదని గుర్తించారు. ఈ క్రమంలో ఈసారి అలాంటి అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో తన అభిమానులతోపాటు వారిద్వారా ఓటర్లనూ జనసేనవైపు మళ్లించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. పవన్‌ కల్యాణ్‌. అభిమానులు ఓటేయలేదు? తెలుగు సినిమాల్లో అశేష అభిమానులు ఉన్న పవన్‌ ఎన్నికల్లో నిలబడితే ఓట్లు గుంపగుత్తగా పడాలి. భారీ మెజారిటీతో విజయం సాధించాలి. కానీ ఈ రెండూ జరగలేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకే కాదు, పవన్‌ కల్యాణ్‌కు కూడా అభిమానులు ఓటేయలేదని స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో తాము పవన్‌ అన్న అభిమానులమే.. ఓటు మాత్రం జగనన్నకు వేశామంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతుంటారు.

జనసేన రాజకీయ శక్తిగా మారాలంటే తనకున్న అభిమాన గణమంతా ఓటర్లుగా రూపాంతరం చెందాలనే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ గ్రహించారు. యువతలో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న రాజకీయ నాయకుడు పవన్‌. ఆయన తర్వాత ఇతర రాజకీయ పార్టీలు నిలుస్తాయి. అంతటి ఫాలోయింగ్‌ మొత్తాన్ని ఈసారి ఎన్నికలకు ఓటర్లుగా మార్చేందుకు పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇటీవలికాలంలో పాల్గొన్న పలు కార్యక్రమాల్లో అరుపులు, విజిల్స్‌ వేసి ఉపయోగమేంటని, ఓటు వేయలేదుకదా అంటూ అభిమానులకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు. యువ శక్తిని సరిగా వినియోగించుకుంటే అధికారం సులువని జనసేనాని గ్రహించారు. జనవరి 12న రణస్థలంలో.. అందుకనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువభేరీ నిర్వహించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువతను ముందుగా సభకు పిలిపించాలనుకున్నప్పటికీ తర్వాత మనసు మార్చుకొని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని యువతను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సభావేదికను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ కూడా రణస్థలం వచ్చి యువభేరీ జరిగే సభా ప్రాంగణాన్ని పరిశీలించబోతున్నారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అంటారు. అలాగే యువతలో అత్యధిక అభిమానులున్న పవన్‌ కల్యాణ్‌ జనసేన కూడా రాజకీయ శక్తిగా ఎదగాలంటే వారు తలుచుకుంటే చాలు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !