జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మరో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కలిసిన విషయం విదితమే. ఈ కలయికపై సినీ, రాజకీయ వర్గాల్లో బోల్డన్ని ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరి సినిమాల షూటింగులు ఒకే చోట జరగడంతో, ఈ ఇరువురి కలయిక జరిగింది. కాగా, బాలకృష్ణ తాజా చిత్రం’వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్..
గతంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంటపురములో’ సినిమాతోపాటుగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి హాజరయ్యారు. దాంతో, అల్లు అర్జున్ అభిమానులు గుస్సా అయ్యారు. ఇప్పుడేమో, ‘వీర సింహా రెడ్డి’తోపాటు మెగాస్టార్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతోంది సంక్రాంతికి. పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం కాకుండా, నందమూరి బాలకృష్ణ కోసం