మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని ప్రియారాలు కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ప్రియుడు.. ఆమెను పట్టుకుని నడిరోడ్డుపై చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మౌగండ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 యేళ్ల పంకజ్ అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వస్తున్నాడు.
ప్రేమకు ఫుల్‌స్టాఫ్ పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను… ఆమెను నడిరోడ్డుపై కిందపడేసి చావబాదాడు. ఈ ఘటన గత బుధవారం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసి పంకజ్‌ను అరెస్టు చేశారు. తనను చావబాదిన ప్రియుడిపై ప్రియురాలు ఫిర్యాదు చేసేందుకు సుతరామా అంగీకరించలేదు. దీంతో చేసేదేమి లేక ప్రియుడిని పోలీసులు విడుదల చేశారు.