UPDATES  

NEWS

అచ్చం కిమ్ లెక్కనే బండి మాట… నా జీవితమంతా పోరాటమే –: సీఎం కేసీఆర్.. బుట్టబొమ్మ.. బతుకమ్మ.. అడవిలో అలజడి……మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ లు ఏజెన్సీలో సంచరిస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీస్ బృందాలు.. దిశ వెల్ఫేర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ పంపిణీ. పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్… కార్యకర్తలపై దాడులకు దిగితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తారు..? అంతా మాయజాలం మున్సిపాలిటీ టెండర్ వండర్ ఓ కంపెనీకి టెండర్ కట్టబెట్టడంలో మతలభేమిటి…? యువ సేవాసమితి అద్వర్యంలో పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు విద్యార్ధలకు బహుకరణ.. కూలిన కల్వర్టు అంచనాకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు..ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం..

 పిల్లలు నువ్వులతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు

నువ్వులు మన భారతీయ వంటకాలలో ఎంతో కాలం నుంచే ఉపయోగిస్తున్నాం. సాంప్రదాయ వంటలైన ముర్కులు, చకినాలలో వీటిని కచ్చితంగా ఉపయోగిస్తారు. బేకరీ ఉత్పత్తులలోనూ నువ్వుల వినియోగం ఉంటుంది. పుష్కల పోషక విలువలు కలిగిన నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. నువ్వులను కేవలం స్నాక్స్‌లో మాత్రమే కాకుండా కూరలు వండటానికి కూడా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెతో వంటలు చేస్తారు, నువ్వుల పొడిని వంటల్లో వేస్తారు. భారతదేశ పురాతనమైన వైద్య విధానమైన ఆయుర్వేదంలో నువ్వులతో చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఉంటుంది. రుతువులను బట్టి ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆయుర్వేదం సిఫారసు చేస్తుంది. అలాగే ఈ చలికాలంలో నువ్వుల తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు వారి లంచ్ బాక్స్‌లో నువ్వుల ఉండలు, నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను అందివ్వాలని న్యూట్రిషనిస్టులు చెబుతారు. వీటిని తినడం ద్వారా పిల్లలకు మంచి శక్తి లభిస్తుంది. జీవక్రియ సమస్యలు, అంటు వ్యాధులను నివారించే ఇమ్యూనిటీ లభిస్తుంది. Sesame Seeds Benefits for Children- పిల్లలు నువ్వులతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ శీతాకాలంలో పిల్లల ఆహారంలో నువ్వులను చేర్చడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. కాల్షియం సమృద్ధిగా ఉంటుంది మిల్లింగ్ చేయని లేదా పొట్టు లేని నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ గింజల్లో 100 గ్రాములకు 60 మి.గ్రా కాల్షియం ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడంలో కాల్షియం కీలకం. కాబట్టి మీ పిల్లల రెగ్యులర్ డైట్‌లో నువ్వులను చేర్చడం వల్ల వారి ఎముకల ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. దంత సంరక్షణ నువ్వులు దంత సంరక్షణ కోసం కూడా కీలకం. ఎందుకంటే ఇదివరకే చెప్పినట్లుగా నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దంత ఆరోగ్యానికి కాల్షియం మూలకం చాలా అవసరం. పిల్లలు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటూ రకరకాల అనారోగ్యకరమైన ఆహారాలు తింటారు. దీంతో వారి దంతాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దానిని నివారించడానికి వారికి నువ్వులు కలిగిన ఆహారం తినిపించడం వలన మేలు జరుగుతుంది. గాయాలను నయం చేయడానికి నువ్వులలో సెసామోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది గాయాలను నయం చేసే ఒక యాంటీఆక్సిడేటివ్ డ్రగ్ లాగా సహాయపడుతుంది. పిల్లలు ఆటలు ఆడేటపుడు తరచుగా గాయాలు చేసుకోవడం మామూలే. అలాంటపుడు వారి గాయం వేగంగా నయం కావాలంటే వారికి నువ్వులను తినిపించండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !