UPDATES  

NEWS

 ఐసీఈ(ICE) థియేటర్ ఫార్మాట్ లో పఠాన్ చిత్రం

పఠాన్ చిత్రంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. పఠాన్‌ మూవీ(Pathaan Movie) తొలి సాంగ్‌తోనే తీవ్ర దుమారం రేపింది. ఈ పాటలో దీపికా పదుకోన్‌ డ్రెస్సింగ్‌, కాషాయ బికినీలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సినిమాలో నుంచి ఈ పాటను తీసేయాలని డిమాండ్‌ చేస్తుండగా.. అసలు సినిమానే నిషేధించాలని కొంతమంది పిలుపునిచ్చారు. ఇదంతా పక్కనపెడితే.. ఐసీఈ(ఇమ్మర్సివ్ సినిమా ఎక్స్‌పీరియన్స్) థియేటర్ ఫార్మట్ లో విడుదల అవుతున్న మెుదటి సినిమాగా పఠాన్(Pathaan) ఘనత సాధించనుంది. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రకటించింది. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఐసీఈ(ICE) థియేటర్ ఫార్మాట్ లో చూస్తే.. మెయిన్ స్క్రీన్ తోపాటుగా సైడ్ ప్యానెల్స్ కూడా ఉండనున్నాయి. నార్మల్ గా కనిపించే కలర్స్, కదలికలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఫార్మాట్ ద్వారా.. ప్రేక్షకులు పూర్తిగా లీనమైనట్టుగా అనుభూతిని పొందుతారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుటామని యశ్ రాజ్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్ రోహన్ మల్హోత్రా ప్రకటించారు.

ఆడియన్స్ కు మెరుగైన సినిమా(Cinema) అనుభవాన్ని అందిస్తామని చెప్పారు. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్, ది బ్యాట్‌మ్యాన్, ఫెంటాస్టిక్ బీస్ట్స్: ది సీక్రెట్స్ ఆఫ్ డంబుల్‌డోర్, టాప్ గన్: మావెరిక్ అండ్ మోర్బియస్ లాంటి సినిమాలు ఐసీఈ ఫార్మాట్ లో విడుదలయ్యాయి. బేషరమ్ సాంగ్(besharam song) విడుదల అయినప్పటి నుంచీ.. ఈ సినిమా కాంట్రవర్సీ అయింది. ఇటీవలే.. అయోధ్యకు చెందిన సాధువు మహంత్‌ పరమహంస అనే సాధవు కూడా కామెంట్స్ చేశారు. షారుక్‌ ఖాన్‌ తన ముందుకు వస్తే సజీవ దహనం చేస్తానంటూ హెచ్చరించడం తీవ్ర దుమారం రేపుతోంది. షారుక్‌ నటించిన పఠాన్‌ మూవీ నుంచి వచ్చిన బేషరమ్‌ రంగ్‌ సాంగ్‌పై ఆ సాధువు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఇలాంటి హెచ్చరిక జారీ చేశారు. ఈ పాటలో దీపికా పదుకోన్‌(deepika padukone) డ్రెస్సింగ్‌పై తీవ్రమైన విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమె కాషాయ రంగు బికినీ వేసుకోవడంపై కొందరు హిందూ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యకు చెందిన సాధువు మహంత్‌ పరమహంస ఆచార్య కూడా ఇదే విషయంపై స్పందించారు. అంతేకాదు పఠాన్‌ మూవీని నిషేధించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ ఈ మూవీని రిలీజ్‌ చేస్తే థియేటర్లను ధ్వంసం చేస్తామని కూడా మహంత్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పఠాన్‌ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న హిందీతోపాటు తెలుగు, తమిళంలలో రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !