UPDATES  

 సందీప్ కిషన్ ‘మైఖేల్’ మూవీ.. ఫస్ట్ సింగిల్

సందీప్ కిషన్(Sundeep Kishan) తొలి పాన్ ఇండియా(Pan India) చిత్రం ‘మైఖేల్’ రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఇందులో ప్రత్యేక యాక్షన్ రోల్‌లో కనిపిస్తారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరికొత్త ట్రాన్స్ ఫర్మేషన్, సిక్స్ ప్యాక్ బాడీ టెర్రిఫిక్‌గా అనిపించింది. ఈ సినిమాకు సంబందించి మరో అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలు’ డిసెంబర్ 28న విడుదల కానుంది.

ఈ చిత్రంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్‌గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్(Varun Sandesh) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్‌లో విడుదలవుతున్న తొలి పాన్ఇండియా సినిమా. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహా నిర్మాణంలో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మైఖేల్ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తెలుగు(Telugu), తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !