UPDATES  

 కొడాలి వర్సెస్ వంగవీటి.. పాత స్నేహాలకు చెక్..

రాజకీయాల్లో వేర్వేరు పార్టీల్లో యాక్టివ్ రోల్ పోషించే చాలామంది నాయకులకు ప్రత్యర్థి పార్టీల్లో సైతం స్నేహితులు ఉంటారు. అటువంటి వారు పార్టీల తరుపున వాయిస్ వినిపిస్తూనే.. తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. బంధుత్వాల విషయానికి వచ్చేసరికి కూడా అలానే కొనసాగుతున్న సందర్భాలు తెలుగు రాజకీయాల్లో కనిపిస్తుంటాయి. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధాక్రిష్ణలు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. నాడు వైసీపీ ఆవిర్భావం తరువాత తొలుత జగన్ వెంట రాధాక్రిష్ణే నడిచారు. తరువాత స్నేహితుడు నానిని వైసీపీలోకి తీసుకొచ్చారు. అయితే రాధా కంటే నానికే వైసీపీలో బాగా వర్కవుట్ అయ్యింది. రాధాను పొమ్మనలేక పొగ పెట్టేశారు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరిపోయారు. అయితే టీడీపీ అన్నా.. ఆ పార్టీ నాయకులు అన్నా ఇంత ఎత్తుకు ఎగసిపడే నాని రాధాక్రిష్ణ స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ మంచి స్నేహం వారి మధ్య ఉంది. అయితే ఆ స్నేహాన్ని కొడాలి నాని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న టాక్ ఉంది. అయితే ఇక నుంచి అది కుదరకపోవచ్చన్న ప్రచారం ఉంది. చంద్రబాబు ఆ దిశగా స్కెచ్ వేశారని తెలుస్తోంది. Kodali Nani vs Vangaveeti Radha గుడివాడలో కాపుల మెజార్టీ మద్దతు కొడాలి నాని దక్కించుకుంటున్నారు.

దీనికి కారణం వంగవీటి రాధాతో ఉన్న స్నేహమే. గుడివాడలో కమ్మ సామాజికవర్గంతో పాటు కాపులు అధికం. ఆ రెండు సామాజికవర్గాల మద్దతుతో కొడాలి నాని వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. అయితే కాపుల మద్దతు మాత్రం వంగవీటి రాధాక్రిష్ణ స్నేహం కారణంగా లభిస్తోంది. నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గంలో ఏ చిన్నకార్యక్రమానికైనా రాధా అటెండ్ అవుతుంటారు. వివాహాలు, శుభకార్యాలకు వస్తుంటారు. అయితే రాధా వచ్చే సమయానికి నాని చేరిపోతుంటారు. ఆయనతో కలివిడిగా ఉంటారు. ఫ్రెండ్ షిప్ మాటున ముచ్చట్లు చెబుతుంటారు. వాటికే మీడియాకు లీకులిచ్చి స్నేహం అంటే ఇదేరా అన్న తరహాలో బిల్డప్ ఇస్తుంటారు. తన స్నేహాన్ని కొడాలి నాని వాడుకుంటున్నారని తెలిసినా రాధా హుందాగా వ్యవహరిస్తుంటారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి అనూహ్యంగా టీడీపీలో చేరిన రాధా ఆ పార్టీ క్యాంపయినర్ బాధ్యతలే తీసుకున్నారు. కోస్తాలోని నాలుగు జిల్లాల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆ సమయంలో గుడివాడ నియోజకవర్గం జోలికి వెళ్లలేదు. దీనికి కొడాలి నానితో ఉన్న స్నేహం ఒక కారణమైతే.. అక్కడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉండడం మరో కారణం. అయితే ఈసారి మాత్రం వంగవీటి రాధాక్రిష్ణ గుడివాడలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసే చాన్సే అధికం. ఒకానొక దశలో రాధాయే టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. గుడివాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఎవరు దిగుతారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఇన్ చార్జిగా ఉన్నారు. మరో ఎన్ఆర్ఐ ఒకరు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబసభ్యుల్లో ఒకర్ని బరిలో దింపే చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ అందరి కంటే రావి వెంకటేశ్వరరావు పోటీచేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !