UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు

నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది.! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం నడిచింది. ఆయన్ని ఓ ఇద్దరు స్వామీజీలు, ఓ వ్యాపారస్తుడు కలిసి, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేలా డీల్ సెట్ చేశారు.

ప్లేటు మార్చిన రోహిత్ రెడ్డి.. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారానికి సంబంధించి, తన వద్దకు వచ్చినవారిని బురిడీ కొట్టించారు పైలట్ రోహిత్ రెడ్డి . పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని పట్టించారు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయగా, ఆ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ నిందితులు పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగ ప్రవేశం చేస్తే.. ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వుంటాయో ఏమో.! తెలంగాణ సిట్ బృందం విచారణతో న్యాయం జరగదని నిందితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !