ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు(Pan India Cinema) ఉన్నాయి. అన్ని సినిమాలు కలిపితే.. వేల కోట్ల బడ్జెట్. ఓ వైపు బిజిబిజిగా ఉంటూనే.. రాబోయే ఏళ్లలో తీయాల్సిన సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు డార్లింగ్. తాజాగా మరో ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడని టాక్. ప్రభాస్-సుకుమార్(Prabhas Sukumar) కాంబినేషన్ లో సినిమా రానుంది. 2024లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. సుక్కు ఓ ఐడియా చెప్పగా.. డార్లింగ్ ఓకే చెప్పేశారని సమాచారం. దీనికి సంబంధించి.. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ప్రాజెక్టుకు అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రభాస్, సుకుమార్ మీటింగ్ తర్వాత.. అడ్వాన్స్ చెల్లించినట్టుగా టాక్ నడుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సుకుమార్(Sukumar) కూడా ప్రభాస్(Prabhas)తో ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆర్య కథ కూడా మెుదట ప్రభాస్ దగ్గరకు వెళ్లిందని చెబుతుంటారు. అప్పుడు ఇతర కమిట్ మెంట్స్ తో చేయలేకపోయారట. ఇప్పటికే ప్రభాస్ కు సుకుమార్ కథను చెప్పాడట. ఓ వైపు ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. షూటింగ్ మధ్యలో ఉన్నవి కొన్ని కాగా.. మరికొన్ని షూటింగ్ చివరిదశకు చేరుకున్నాయి. డైరెక్టర్ సుకుమార్ పుష్ప-2(Pushpa 2)తో బిజిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
నిజానికి రంగస్థలం రిలీజ్ కు ముందు కూడా ప్రభాస్ ను సుకుమార్ కలిసి ఓ స్టోరీ చెప్పాడట. కానీ అప్పటి నుంచి ఇద్దరూ బిజిగానే ఉన్నారు. ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానుంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రావాలని కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఇప్పుడు.. ఏ హీరో లేనంత బిజిగా ఉన్నాడు. అతడి చేతిలో అన్నీ పాన్ ఇండియా సినిమాలే. బాహుబలి(Bahubali) తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఫలితాలు కాస్త నిరాశపరిచాయి. అయినా ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్- ప్రాజెక్టు కె(Project K), ప్రశాంత్ నీల్-సలార్, మారుతీతో హర్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్(Adipurush) సినిమా మీద కూడా ప్రభాస్ వర్క్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ విడుదలకు ఇంకాస్త సమయంలో తీసుకునే ఛాన్స్ ఉంది. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్(Spirit) అనే సినిమా కూడా చేయనున్నాడు ప్రభాస్. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ప్రభాస్ కమిట్‌మెంట్స్‌తో ఉన్నాడని టాక్.