UPDATES  

 బాలీవుడ్(Bollywood) పోకడలు.. అప్పుడప్పుడు పూర్తి భిన్నం

బాలీవుడ్(Bollywood) పోకడలు.. అప్పుడప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. పబ్స్, పార్టీలు అంటూ వెళ్లడం వరకూ ఓకే. కానీ కొన్నిసార్లు హద్దుమీరి.. కెమెరాకు చిక్కుతారు అప్పుడే సమస్య. సెలబ్రిటీ(Celebrity) అనగానే.. సహజంగానే అందరికీ ఆసక్తిగా ఉంటుంది. ఇక వాళ్లకు సంబంధించిన వీడియో వైరల్(Video Viral) అవుతుంది. బాలీవుడ్ స్టార్ కిడ్స్(Bollywood Star Kids) పిల్లలు సైతం ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లొ నిలుస్తున్నారు. బాలీవుడ్ కల్చర్ ను ఎంజాయ్ చేస్తూ.. నెటిజన్లకు దొరికిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఫ్రెండ్స్ తో పబ్ కి వెళ్లింది ఓ స్టార్ కిడ్. మరుసటి రోజే.. దారుణమైన ట్రోల్స్ కి గురైంది. ఆమె ఎవరో కాదు.. స్టార్ హీరో అజయ్ దేవగన్-కాజోల్(Ajay Devgan-Kajol) దంపతుల గారాలపట్టి నైసా దేవగణ్(Nysa Devgan). ఈమె ఒర్హాన్ చేతులు పట్టుకుని నడుస్తున్న వీడియో వైరల్ అయింది. ఇది చూసిన అజయ్ దేవగన్-కాజోల్ ఫ్యాన్స్ నైసాను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

తప్ప తాగి ఉన్నారంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి పేరు సంపాదిస్తే.. పిల్లలు నాశనం చేస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. నైసా దేవగణ్ ఫుల్‌గా తాగి ఉందంటూ మరికొంతమంది కామెంటుతున్నారు. బోల్డ్ డ్రెస్, మేకప్, ఓపెన్ హెయిర్.., తన రూపాన్ని మార్చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంత బోల్డ్ లుక్ ఏంటని అడుగుతున్నారు. క్రిస్మస్ పార్టీ మూడ్ కదా మామూలే అనుకోవచ్చు. కానీ, నైసా డ్రెస్సింగ్ స్టైల్, ఫుల్లుగా తాగేసి ఒర్హాన్ చేతిలో చెయ్యి వేసి బయటికి రావడం నెటిజన్లకు నచ్చనట్టుగా ఉంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పెడితే.. తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహికా రాంపాల్, ఇతర స్టార్‌కిడ్‌లు కూడా పార్టీలో ఉన్నట్టుగా కనిపించారు. బాలీవుడ్ స్టార్స్(Bollywood)కి, వాళ్ళ పిల్లలకి పార్టీ కల్చర్ కొత్తేమీ కాదు. షారుఖ్ కూతురు సుహానా ఖాన్, జాన్వీ సోదరి ఖుషి కపూర్ లాంటివారు కూడా నైట్ పార్టీస్ లో పాల్గొని వార్తల్లోకి ఎక్కారు. తాజాగా బయటకు వచ్చిన నైసా వీడియోను మాత్రం దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. తల్లిదండ్రులు కష్టపడితే.. పిల్లలు ఇలా పబ్స్, పార్టీలు అంటూ తప్పతాగి పేరు చెడగొడుతున్నారని విమర్శిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !