UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పెద్ద హీరోల అభిమానుల మధ్య గొడవలు

పెద్ద హీరోల అభిమానుల మధ్య గొడవలు సహజమే. తాజాగా తమిళ సూపర్‌ స్టార్లు విజయ్‌, అజిత్‌ అభిమానుల మధ్య ఇప్పుడిదే ఘర్షణ నడుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు ఈసారి సంక్రాంతికి పోటీ పడనున్న విషయం తెలిసిందే. అజిత్‌ మూవీ తునివు జనవరి 11న రిలీజ్‌ కాబోతోంది. విజయ్ వారసుడు మూవీ రిలీజ్‌ డేట్‌ ఇంకా అనౌన్స్‌ చేయకపోయినా.. సంక్రాంతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు తమిళనాడులో థియేటర్లు దొరకడం లేదు. అదే సమయంలో సీఎం స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌.. తునివు మూవీని రిలీజ్‌ చేయబోతున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు ఆ సినిమాకే దక్కాయి. తన సినిమాకు థియేటర్లు లేకపోవడంతో వారసుడు నిర్మాత దిల్‌ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమిళనాడులో అజిత్‌ కంటే విజయ్ పెద్ద స్టార్‌ అని, అందువల్ల తన సినిమాకే ఎక్కువ థియేటర్లు ఉండాలని అనడం తీవ్ర దుమారం రేపింది. అప్పటి నుంచి ఎవరు పెద్ద స్టార్‌ అన్న చర్చ జరుగుతోంది. తాజాగా నటి త్రిష్‌ కూడా దీనిపై స్పందించింది.

దళపతి67లో ఆమె విజయ్‌ సరసన నటించనున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ చర్చపై త్రిష స్పందిస్తూ.. “నంబర్స్‌ గేమ్‌ను నేను వ్యక్తిగతంగా అసలు నమ్మను. ఇది కేవలం ఒకరి చివరి సినిమాను బట్టి మాత్రమే లెక్కిస్తారు. చివరి సినిమా హిట్‌ అయితే అతన్నే నంబర్‌ 1 అంటారు. కొన్ని రోజులుగా రిలీజ్‌లు లేకపోతే ఆ స్థానంలో మరొకరు వస్తారు” అని అభిప్రాయపడింది. విజయ్‌, అజిత్‌ల మధ్య ఒకరికి తాను ఓటు వేయబోనని కూడా స్పష్టం చేసింది. “నేను సినిమాల్లోకి రాక ముందు నుంచే విజయ్‌, అజిత్‌లు సినిమాల్లో ఉన్నారు. ఓ ప్రేక్షకురాలిగా వాళ్ల సినిమాలు చూశాను. వాళ్ల సినిమాలు చూస్తే కలిగే ఆనందం కోసమే ప్రతి ఒక్కరూ థియేటర్లకు వెళ్తారు. ఈ ఇద్దరు హీరోలకు ఫ్యాన్‌ క్లబ్స్‌ ఉన్నా కూడా ఈ నంబర్ల గేమ్‌ మనం మొదలుపెట్టిందే. ఇద్దరూ పెద్ద సూపర్‌స్టార్లే. వాళ్లలో ఎవరు పెద్ద అంటే నేనెలా చెప్పగలను” అని త్రిష చెప్పింది. ఈ మధ్యే పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీలో కనిపించిన త్రిష.. ఇప్పుడదే మూవీ సీక్వెల్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. ఇక ఆమె బృందా అనే వెబ్‌ సిరీస్‌లోనూ ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !