UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 దళపతి విజయ్(Thalapathy vijay) వారసుడు సినిమా విడుదలకు సిద్ధం

దళపతి విజయ్(Thalapathy vijay) వారసుడు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో దళపతి విజయ్, రష్మిక మందన్న తదితరులు నటించారు. ప్రమోషన్ వర్క్ భారీగా జరుగుతోంది. తర్వాత లోకేష్‌ కనగరాజ్‌(lokesh kanagaraj) తో విజయ్ ‘దళపతి 67′(Thalapathy 67) పనుల్లో బిజీ ఉంటాడు. ఈ చిత్రంలో అర్జున్‌ సర్జా(Arjun Sarja) విలన్‌గా నటిస్తున్నాడు. సినిమా కోసం ఆయన భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్(sanjay dutt), గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు.అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం 4.5 నుంచి 5 కోట్ల పారితోషికం(Remuneration) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ దత్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దళపతి విజయ్ 100 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ చెన్నై(Chennai)లో జరగనుంది.

మేజర్ పార్ట్ షూటింగ్ కాశ్మీర్(Kashmir)లో ప్లాన్ చేశారు. ‘దళపతి 67’ బడ్జెట్ 200 కోట్ల రూపాయలను దాటేసిందని అంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 2023లోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు(digital rights) ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడింది. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్‌ విజయ్‌, లోకేష్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్‌ హక్కులు ఈ డీల్‌ కింద నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందట. వారసుడు(Varasudu)పై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నారు. దళపతి ఫ్యాన్స్(Thalapathy Fans) కూడా ఎదురుచూస్తున్నారు. విక్రమ్‌(Vikram) హిట్‌తో డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఊపు మీద ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమాపై క్రేజ్ ఉంది. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా(Pan India) లెవల్లో ఈ సినిమా రిలీజ్‌ చేసే ఛాన్స్ ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !