రెండేళ్లపాటు ప్రపంచాన్ని కరోనా(Corona) వణికించింది. ఇండియాలోనూ కరోనా పెద్దఎత్తున కలకలం సృష్టించింది. 2022లో ఇక కరోనా భయం లేదనుకున్నారు. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి.. మళ్లీ కొత్త రూపంలో బీఎఫ్7(BF 7) వేరియంట్ అందరికీ భయం పుట్టిస్తోంది. అన్ని రంగాలపై దీని ప్రభావం పడనుంది. ఇక సినిమా(Cinema) రంగంపై పెద్ద ఎత్తున కరోనా ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనిపైనే ఇప్పుడు టెన్షన్ మెుదలైంది. ఓ వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం.. చైనాను వివరాలు సమర్పించాలని కోరింది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం.. కరోనా హెచ్చరికలు మళ్లీ జారీ చేస్తున్నాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒకటి చొప్పున కొత్త వేరియంట్ నమోదైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వింటున్న టాలీవుడ్(Tollywood) జనానికి భయం పట్టుకుంది. ఒక్క ప్రభాస్(Prabhas) సినిమాలే మూడు వేల కోట్ల బడ్జెట్ వరకు ఉన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న చిన్న చిన్న సినిమాల బడ్జెట్ కలుపుకొంటే ఎంత బడ్జెట్ అవుతుందో ఊహించొచ్చు.
పది వేల కోట్లకుపై దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతం యథావిధిగా షూటింగ్స్(Shootings) జరుగుతున్నాయి. కరోనా ఏదైనా మళ్లీ విలయం సృష్టిస్తే.. ఏంటి పరిస్థితి అని భయం మెుదలైంది. ఇప్పుడు జనాలు బయటకు వచ్చి సినిమా థియేటర్లకు కూడా వెళ్తున్నారు. మరోసారి ఆంక్షలు విధిస్తే సినిమా షూటింగ్స్(Cinema Shootings), విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల పరిస్థితి ఏంటా అని టెన్షన్ మెుదలైంది. అసలే సంక్రాంతి(Sankranthi) వస్తుంది. వీరసింహారెడ్డి(Veera Simha Reddy), వాల్తేరు వీరయ్య(Waltair Veerayya), వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం, విద్య వాసుల అహం.. ఇలా చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల అగ్రిమెంట్లు, అడ్వాన్సులు ఇచ్చి పుచ్చుకోవటం, సంబరాలకు అభిమానుల ఏర్పాట్లు, స్క్రీన్ల పంపకాలు.. ఇలా తెరవెనక ఎన్నో పనులు నడుస్తున్నాయి. ఇలా పనులన్నీ.. నడుస్తున్న సమయంలో ఏ చిన్న ట్విస్ట్ వచ్చినా.. తట్టుకోవడం కష్టమే. ఆంక్షలని మెుదలుపెడితే.. ముందుగా ఎక్కువగా ప్రభావితం అయ్యేది సినిమా పరిశ్రమనే(Cinema Industry). రిలీజులు వాయిదా పడినా.., ఆగిపోయినా.., కోట్లలో నష్టం ఉంటుంది. ఇక వాటి మీద వడ్డీ.. ఊహకు అందని విధంగా ఉంటుంది. మహమ్మారి.. ఇండియాలో వ్యాప్తి చెందకుండా ఉంటే.. అదే పదివేలు అని టాలీవుడ్(Tollywood) కోరుకుంటోంది.