ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ అసమ్మతి చెలరేగుతుంటుంది. తెలంగాణలో మొదలైంది. ఇప్పుడు ఏపీకి పాకింది. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి అసమ్మతి రగిలించాడు. ఆ కాకను చిన్నగా అంటించాడు. ఈ జ్వాల ఖచ్చితంగా మరింత మందిని చేర్చి వైసీపీని దహించడం ఖాయమని అంటున్నారు. నెల్లూరు జిల్లా రావూరులో సచివాలయ వైసీపీ కన్వీనర్లు, వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలోనే ఆనం రాం నారాయణరెడ్డి సొంత ప్రభుత్వం చేతగానితనంపై విమర్శలు చేయడం పునుమారం రేపింది. ‘రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవు.. నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశామని ప్రజలను ఓట్లు అడుగుతాం.
ప్రాజెక్టులు కట్టామా? పనులు మొదలుపెట్టామా? పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? గత ప్రభుత్వం ఇచ్చినా ఓడిపోయింది కదా? ‘ అంటూ వైఎస్ జగన్ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఏం చేయలేదని విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజలు నన్ను కూడా నమ్మే స్థితిలో లేరని ఆనం ఆవేదన వ్యక్తం చేయడం విశేషం. ఆనం వైసీపీలో మొదటి నుంచి జగన్ పాలనపై వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ ఆడపా దడపా బయటపడేది. ఈసారి డైరెక్ట్ గానే విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత ఓపెన్ గా జగన్ సర్కార్ ను ఆ పార్టీ ఎమ్మెల్యే తిట్టిపోయడం సంచలనమైంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా అసమ్మతి రాజేశారు. ఇప్పుడు ఇదే జిల్లాలో ఆనం కూడా తోడయ్యారు. చూస్తుంటే వైసీపీలో అసమ్మతి జ్వాల నెల్లూరు నుంచే మొదలయ్యేలా కనిపిస్తోంది. జగన్ ఏపీలో లేని సమయంలో.. ఢిల్లీలో మోడీని కలిసిన సందర్భంలో ఇలా ఆనం రెచ్చిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. మరి వీటికి జగన్ అడ్డుకట్ట వేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని మరింతగా కమ్మేయడం ఖాయమంటున్నారు.