UPDATES  

NEWS

 ఒక రెస్పాన్స్ బుల్ పర్సన్ అయినప్పుడు కులాభిమానంపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలి

చేప్పేవన్నీ శ్రీరంగ నీతులు,,,చేసేవన్నీ సా..పనులు అన్నట్టుంది మాజీ మంత్రి పేర్ని నాని మాటలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాదిరిగా మాటల మాంత్రికుడినని భావిస్తున్నట్టున్నారు. తాను ఏది చెప్పినా బాగా చెబుతానని జబ్బలు చరుచుకుంటున్నారు. తనకు తాను జగన్ కుటుంబానికి పెద్ద పాలేరుగా అభివర్ణించుకునే నాని మరింతగా దిగజారుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన పవన్ ను అడ్డగాడిదగా సంభోదించారు. మంత్రి పదవి తీసేసినా.. కాపులు, కాపు నాయకులను కించపరుస్తూ జగన్ అభిమానం ఉంటే చాలునన్నట్టు పేర్ని నాని వ్యవహరిస్తున్నారు. ఆయన వాడుతున్న భాష, మాటలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. కామెంట్స్ శృతి మించుతున్నాయి.

కేవలం కాపులు, కాపు నాయకులకే తిట్టడానికే తాను ఉన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. టీవీల్లో, సోషల్ మీడియాలో ఆయన కామెంట్స్ చూస్తున్న వారి ఏహ్యభావం కలుగుతోంది. రాజకీయాల గురించి ఇంతలా దిగజారిపోవాలా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. Perni Nani సాధారణంగా అందరికీ కులాభిమానం ఉంటుంది. అందునా ఒక రెస్పాన్స్ బుల్ పర్సన్ అయినప్పుడు కులాభిమానంపై చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తన కులంపై ప్రత్యేక అభిమానం చూపుతూనే.. ఎదుటి కులాలను గౌరవించాలి. అయితే ఇప్పుడు పేర్ని నాని విషయానికి వచ్చేసరికి ఇది రివర్స్. తమ అధినేత అభిమానాన్ని చూరగొనడానికి సొంత సామాజికవర్గాన్ని తిడతారు. సొంత కుల నాయకులపై తిట్ల దండకానికి దిగుతారు. తానుకాపునని చెబుతూనే జగన్ పెద్ద పాలేరుగా తనకు తాను అభివర్ణించుకుంటారు. అప్పుడెప్పుడో మంత్రి పదవి చేతిలో ఉంది కనుక.. దానికి కొనసాగింపు కోరుకుంటున్నారు కనుక అలా మాట్లాడి ఉంటారని అంతా భావించారు. కానీ మంత్రి పోస్టు ఊడిపోయినా.. కాపులు, కాపు నాయకులను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కనీసం తోటి వైసీపీ కాపు నాయకులు కూడా వాడని భాషలో మాట్లాడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !