UPDATES  

 ఓవెన్ లేకపోయినా.. ఇంట్లోనే గార్లిక్ బ్రెడ్

ఇంట్లో రెస్టారెంట్-స్టైల్ గార్లిక్ బ్రెడ్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? కానీ మీ దగ్గర ఓవెన్ లేదని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. ఇంట్లోనే సింపుల్​గా, టేస్టీగా, ఓవెన్ లేకుండా బ్రెడ్ తయారు చేయవచ్చు మీకు తెలుసా? మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * ఆల్ పర్పస్ పిండి – 1 కప్పు * పంచదార – 1 టీస్పూన్ * ఉప్పు – తగినంత * ఒరేగానో – 2 టేబుల్ స్పూన్స్ * వెల్లుల్లి – 1 టీస్పూన్ (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి) * చిల్లీ ఫ్లేక్స్ – 2 టేబుల్ స్పూన్స్ * వెన్న – 2 టేబుల్ స్పూన్స్ * చీజ్ – అరకప్పు (తురిమినది) * కార్న్ – అరకప్పు (ఉడికించినవి) * నూనె – 2 టేబుల్ స్పూన్లు నో ఓవెన్ గార్లిక్ బ్రెడ్ తయారీ విధానం ముందుగా పావు కప్పు చక్కెరను గోరువెచ్చని నీటిలో కరిగించండి. దానిలో ఈస్ట్ వేసి కలపాలి. అనంతరం దానిని కొద్దిసేపు పక్కన పెట్టేయండి.

ఈ సమయంలో ఈస్ట్ మెత్తగా అవుతుంది. ఇప్పుడు దానిలో మైదా పిండి వేసి బాగా కలపాలి. పిండిపై కొంచెం నూనె పోసి మరోసారి మెత్తగా చేసి పక్కన పెట్టండి. 15 నిమిషాల్లో పిండి తయారవుతుంది. మీ చేతులకు నూనె రాసి.. మళ్లీ పిండిని బాగా మెత్తగా కలపండి. ఇప్పుడు పిండి నుంచి కొంత భాగాన్ని తీసి.. మైదా పిండిని చల్లి చపాతీలా చేయండి. ఇప్పుడు దానిలో వెన్న, ఉడకబెట్టిన మొక్కజొన్నను వేసి క్లోజ్ చేయండి. అంచుపై నూనెను పూసి.. క్లోజ్ చేసి రోల్ చేయండి. దానిపై మళ్లీ వెన్నను రాయండి. దానిలో ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి పొడిని చల్లి, లైట్ కట్స్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి దానిపై పాన్ ఉంచండి. పాన్‌లో ఉప్పు వేసి వేడి చేయండి. ఒక గిన్నె ఉంచి లేదా ఉప్పు మధ్యలో ఇప్పుడే తయారు చేసుకున్న గార్లిక్ బ్రెడ్‌ను బేకింగ్ ట్రేను ఉంచండి. బేకింగ్ ట్రే ప్లేస్ చేసిన తర్వాత పాన్, దానిపై ఒక మూత ఉంచండి. 15 నిమిషాలు ఉడకనివ్వండి. అనంతరం బేకింగ్ ట్రేని తీసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !