UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 తెలుగింటి ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే..పుదీనాలో ఉండే పోషకాలు

తెలుగింటి ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే.

ఇక తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగిస్తారు. చాలా సలాడ్స్‌లో, డెజర్ట్స్‌లో కూడా పుదీనా వాడుతారు. ఇక చాలా మంది ఫేవరైట్ అయిన బిర్యానీలో పుదీనా బాగా వాడుతారు. నాన్ వెజ్ వంటకాల్లో చాలా వరకు పుదీనా వాడతారు. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ పుదీనాలో ఏముంది? పుదీనా అంటే అంత స్పెషల్. ముందుగా పుదీనా ఆకుల్లో ఉండే పోషకాలను గమనిద్దాం.

ప్రతి 100 గ్రాముల పుదీనాలో ఉండే పోషకాలు

* క్యాలరీలు 70

* టోటల్ ఫ్యాట్ – 0.9 గ్రాములు

* శాచ్యురేటెడ్ ఫ్యాట్ — 0.2 గ్రాములు

* సోడియం – 31 మి.గ్రా.

* పొటాషియం – 569 మి.గ్రా.

* కార్బొహైడ్రేట్లు — 15 గ్రా.

* డైటరీ ఫైబర్ – 8 గ్రాములు

* ప్రోటీన్ – 3.8 గ్రాములు

ఇక ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బీ 6, మాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి.

* కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది.

* పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి ఐబీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అకస్మాత్తుగా నొప్పితో విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండే క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని ఆ అధ్యయనాల్లో తేలింది.

* పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీ. భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ దారికొస్తాయి. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !