నాగచైతన్య హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న కస్డడీ సినిమా రిలీజ్ డేట్‌ను బుధవారం రివీల్ చేశారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా 2023 మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ బైలింగ్వల్ సినిమాలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. కెరీర్‌లో తొలిసారి అతడు పోలీస్ పాత్రలో నాగచైతన్య నటిస్తోన్న సినిమా ఇది. ఇటీవలే నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్‌లో నాగచైతన్య పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు.
కస్టడీ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది బంగార్రాజు తర్వాత నాగచైతన్య, కృతిశెట్టి రెండోసారి జంటగా నటిస్తోన్న సినిమా ఇది. తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో కస్టడీ రూపొందుతోంది. రెండు భాషల్లో ఒకేరోజు రిలీజ్ చేయనున్నారు. ఇందులో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. ప్రియమణి, శరత్‌కుమార్, సంపత్‌రాజ్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. కస్టడీ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్‌రాజా కలిసి సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా 2022 నాగచైతన్యకు మిక్స్‌డ్ రిజల్ట్‌ను మిగిల్చింది. ఈ ఇయర్‌లో నాగచైతన్య నటించిన బంగార్రాజు విజయాన్ని సాధించగా థాంక్యూ సినిమా మాత్రం నిరాశపరిచింది.