మెగా ఫ్యామిలీ ఒకప్పుడు సినిమాల కారణంగానే వార్తలు ఉండేది, కానీ ఇప్పుడు వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న నేపథ్యంలో ప్రచారం మొదలైంది. తాజాగా మెగా ఫ్యామిలీ గురించి మరో పుకారు షికారు చేస్తోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక చాలా సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది. ఈ సమయంలో సోషల్ మీడియా లో కొందరు ఆమె విడాకులు తీసుకుందంటూ పిచ్చి పుకార్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఫోటోలను వారు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ ఫోటోలో ఆమె భర్త లేడు కనుక ఇద్దరు విడి పోయారు అంటూ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రతి కార్యక్రమానికి కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు బిజీగా ఉంటారు..
కనుక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వారు విడి పోయారు అంటూ ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ మెగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీకి చెందినవారు కూడా స్పందిస్తూ నిహారిక మరియు ఆమె భర్త చాలా సంతోషంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. mega daughter niharika breakup news rumors only నిహారిక ఫిలిం మేకింగ్ పై చాలా ఆసక్తి కనబరుచుతూ ఉంటారు. అందుకే ఆమె ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే ఆమె భర్త ఇతర వ్యాపారాలతో బిజీగా ఉంటారు.. కనుక ఎవరికి వారే అన్నట్లుగా బిజీగా ఉండడం వల్ల ఎక్కువ సందర్భాల్లో కలవడం లేదేమో అంతే తప్పితే విడి పోలేదు అంటూ మెగా ఫాన్స్ లో కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక మరియు ఆమె భర్త కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చి విడాకులు తీసుకున్నారంటే ప్రచారం చేసిన వారి నోళ్లు మూయించే అవకాశాలు ఉన్నాయి.