బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి తెలుసు కదా. మూడు దశాబ్దాల నుంచి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో హీరోగా ఉన్నాడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన వయసు ప్రస్తుతం 56 ఏళ్లు అయినప్పటికీ.. సల్మాన్ ఖాన్ ఇంకా బ్యాచ్ లర్ గానే ఉన్నాడు. అంతే కాదు.. ఎంతో మంది యువతుల కలల రాకుమారుడు సల్మాన్ ఖాన్. అయితే.. తను ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోయినా చాలామందిని ప్రేమించాడు. ఇండస్ట్రీలోనే చాలామందితో ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు అప్పట్లోనే వార్తలు వినిపించాయి. కొందరితో పెళ్లి వరకు వెళ్లినా చివరకు పెళ్లి పెటాకులు అయింది. అలా… సల్మాన్ ఖాన్ తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటి వరకు చాలామందితో ప్రేమ వ్యవహారాలు నడిపాడని ఆ లిస్టు కూడా చాలా పెద్దదే అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ తాను చదువుకునే రోజుల్లోనే సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్ ను ప్రేమించారట. ఆమె ఎవరో కాదు.. ప్రస్తుత హీరోయిన్ కియరా అద్వానీ మేనత్త. ఆ తర్వాత సల్మాన్ ఖాన్.. హీరోయిన్ సంగీత బిజ్లానీని ఇష్టపడ్డారట. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు. Salman Khan About on Pooja Hegde Pooja Hegde : పాకిస్థాన్ నటి సోమి అలీతోనూ డేటింగ్ ఆ తర్వాత సల్మాన్ ఖాన్.. పాకిస్థాన్ నటి సోమి అలీతో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. అనంతరం ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్, స్నేహా ఉల్లాల్, కత్రినా కైఫ్, జర్మన్ నటి క్లాడియా, రొమానియాకు చెందిన నటి లులియా, యురోపియన్ నటి మెహెక్ చాహల్, బాలీవుడ్ నటి డైసీ షా, బ్రిటన్ నటి హేజెల్, సోనాక్షి సిన్హా, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లతోనూ సల్మాన్ ఖాన్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇంతమందితో డేటింగ్ చేసినా చివరకు సల్మాన్ ఎవ్వరినీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.