నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే షోలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో కి ఎంతోమంది సినీ ప్రముఖులు అతిథులుగా వస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఈ షో కి వచ్చి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మొదటిగా వచ్చిన సీజన్ వన్ భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రెండవ సీజన్ కూడా వచ్చింది. ఇక ఈ సీజన్లో కూడా మొదటి సీజన్ మాదిరిగానే ఎంతోమంది ప్రముఖులు స్టార్ హీరోలు వచ్చి వెళ్లారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ టు షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి వస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రోగ్రాం లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నాడు అనే ఆత్రుత అందరిలో మొదలైంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఇవే ప్రశ్నలు అడిగారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారని సమాచారం. అలాగే 2014లో జరిగిన ఒక సంఘటన గురించి కూడా అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వాటి పై కూడా అడిగినట్లు సమాచారం. Pawan Kalyan in Unstoppable with NBK show Video viral వాటికి పవన్ కళ్యాణ్ తన స్టైల్ లో జవాబు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎక్కడ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు ఈ షో లో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా చెప్పారని సమాచారం. అలాగే చిరంజీవి నాగబాబు మరియు పవన్ కళ్యాణ్ కి మధ్య బంధం ఎలా ఉంటుంది , అలాగే వారి మీద జరిగిన సమస్యల గురించి కూడా బాలకృష్ణ అడిగినట్లు సమాచారం.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏది నిజమో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే.