UPDATES  

 అంతుపట్టని జగన్ ఢిల్లీ పర్యటన గుట్టు

మావాడు అడిగితే ఏం చెప్పకు అని హీరో అంటాడు.. ఆడేంటి అడుగుతాడు…వీడేంటి చెప్పొందంటున్నాడు అంటూ స్నేహితుడు నిట్టూరుస్తాడు.. ఆ మధ్యన మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సితమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీన్ అది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు ఢిల్లీ పెద్దలు కలిసినప్పుడు ఇటువంటి సీనే రిపీట్ అవుతుంటుంది. అవతల వాళ్లు ఏ మూడ్ లో ఉన్నా.. కొద్దిసేపు ముచ్చటించినా.. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ చర్చించినట్టు చెబుతారు. విభజన సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. గత మూడున్నరేళ్లుగా ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. సీఎం జగన్ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. ఇలా కలిసే సమయంలోనే ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అస్వస్థతకు గురయ్యారని వార్తలు వచ్చాయి.

ఆ సమయంలో మోదీ ఏ మూడ్ లో ఉన్నారో తెలియదు కానీ.. సుమారు అరగంట పాటు సీఎం జగన్ తో సమావేశమయ్యారని.. విన్నపాలన్నీ విన్నారని, సానుకూలంగా స్పందించారని సీఎం జగన్ తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. Jagan Delhi Tour ప్రధానితో భేటీ అనంతరం గత మూడున్నరేళ్లుగా ఒకే ఫార్మెట్ లో ఇస్తున్న ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. కానీ స్వల్ప మార్పులు చేశారండోయ్. ప్రత్యేక హోదా, పోలవరం.. ఇలా అన్నీ అడిగేసినట్టు రాసుకొచ్చారు. గత మూడేళ్లుగా ఇవే అడుగుతున్నట్టు చెప్పినా.. కేంద్ర ప్రభుత్వం దయతలచలేదు. ఇప్పుడు కూడా ఏది ఇస్తుందో కూడా స్పష్టత లేదు. అసలు లోపల ఏం జరిగిందో.. ఎటువంటి చర్చలు జరిగాయో బయటకు రావడం లేదు. కానీ ఇలా వెళ్లిన ప్రతిసారి కేంద్రం నుంచి సానుకూలత అన్న మాట మాత్రం బయటకు వస్తుంది. ప్రధానితో భేటీ అనంతరం జగన్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రిని కలిశారు. రుషికొండ తవ్వకాలపై కమిటీ వేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ కలవడంపై రకరకాల ఉహాగానాలు రేగుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !