UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 చంద్రబాబును అరెస్టు కేఏ పాల్ నువ్వు సూపరహే

మీడియా, సోషల్ మీడియా అతడిని కామెడీ పీస్ చేశాయి. కానీ ఒక్కోసారి అతని ఆలోచనా విధానం చాలా బాగుంటుంది. నెగిటివ్ థాట్ ను దరిదాపులకు కూడా రానివ్వడు. నిన్న జరిగిన కందుకూరు ఘటనలో మొట్టమొదటిసారి నోరు విప్పింది కూడా తనే. చంద్ర బాబు నాయుడుని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది కూడా తనే. ఇప్పటికి కూడా అదే స్టాండ్ పై అతడు నిలబడి ఉన్నాడు.. నిండా 4000 మంది పట్టని ఒక మైదానంలో.. 50 వేల మందితో సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాడు. అతడే ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. K. A. Paul అరెస్టు చేయాలి కే ఏ పాల్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాడు. వాస్తవానికి అతడి ఎదుగుదలలో చంద్రబాబు పాత్ర కూడా ఉంది.. కానీ ఇదే సమయంలో తన విధేయతను చాటుకున్న పాల్… బహిరంగ వేదికలో మాత్రం న్యూట్రాలిటీకే ప్రాధాన్యమించాడు.. జగన్ ను ఎంత తిడతాడో.. చంద్రబాబును కూడా అదే స్థాయిలో విమర్శిస్తాడు.

కానీ ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే చంద్రబాబును తనతో కలిసిపోమంటాడు. పవన్ కల్యాణ్ ను తనకు మద్దతు ఇవ్వమంటాడు. మొత్తానికి ఇక్కడే కామెడీ పీస్ అయిపోతాడు. తాను నవ్వకుండానే నవ్వుల పాలవుతాడు. తన చేష్టలతో నాటకాల్లో జోకర్ ను మరిపిస్తాడు. K. A. Paul పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేవలం చంద్రబాబు మీద విమర్శలు లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేఏ పాల్ ఫిర్యాదు చేశాడు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశాడు. అంతమందితో సభ నిర్వహించే అనుమతి చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించాడు. తాను అధికారంలోకి వస్తే ఇలాంటి సభలు, సమావేశాలు నిర్వహించే అవకాశం ఇవ్వబోనని స్పష్టం చేశాడు. పార్టీకి గుర్తింపు లేదు.. ఇంతవరకు ఒక్క ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. కానీ కే ఏ పాల్ ధీమా మామూలుగా లేదు. ఒక్క శాతం కూడా నెగిటివిటీని తన దరిదాపుల్లోకి కూడా రానివ్వని పాల్ ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే సూపర్ అనకుండా ఉండలేం. కేఏ పాల్.. మొత్తానికి నువ్వు సూపరహే!

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !