UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 అంబటికి క్లాస్ పీకిన నాగబాబు

పవన్ ఏది చేసినా.. ఎక్కడికి వెళ్లినా వైసీపీలో కలవరపాటే. చివరకు బాలక్రిష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు పవన్ వెళ్తున్నారన్న నాటి నుంచి వైసీపీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్లు పనిగట్టుకొని మాట్లాడుతున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో రెండో సీజన్లో అడుగు పెట్టింది. చంద్రబాబు, లోకేష్ లతో రెండో సీజన్ ప్రారంభంకాగా.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిల ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. అటు తరువాత ఎంతో మంది సినీ ప్రముఖుల ఎపిసోడ్లు వచ్చాయి. అయితే పవన్ షో లో అడుగుపెట్టనున్నాడని తెలిసిన నాటి నుంచే సినీ, రాజకీయ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి కనిపించింది. అటు బాలక్రిష్ణ, ఇటు పవన్ అభిమానుల్లో కూడా షో విపరీతమైన హీట్ పెంచేసింది. అయితే ఈ షో ద్వారా బాలయ్య, పవన్ లు కలవడంపై మాత్రం వైసీపీ కలవరపాటుకు గురవుతోంది. Ambati Rambabu- Nagababu మంత్రులు అంబటి రాంబాబు, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘అన్నయ్య షోకు డుమ్మా.. బాలయ్య షోకి జమ్మ..రక్తసంబంధం కంటే ప్యాకేజీ సంబంధమే గొప్పదా?’ అంటూ మంత్రి అంబటి ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కు సంబంధించి పెద్ద రచ్చే నడుస్తోంది. జన సైనికులు, అభిమానులు, మెగా ఫ్యాన్స్ గట్టిగానే రిప్ల

య్ ఇస్తున్నారు. నువ్వు నీటి పారుదల శాఖ మంత్రివి. ముందు పోలవరంపై ఫోకస్ చెయ్ అని కౌంటర్ ఇస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సైతం స్పందించారు. బాలక్రిష్ణ సినిమా డైలాగు తరహాలో అంబటికి గట్టిగానే హెచ్చించారు. ‘ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్.. వె.ధ.వ సోది’ అంటూ ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లూ లేనిది బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ షోపై వైసీపీ అతిగా స్పందించడానికి చాలా కారణాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుందన్న వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రెండు పార్టీల మధ్య మంచి వాతావరణం నడుస్తోంది. అయితే దీనినే ఊహిస్తూ వస్తున్న అధికార వైసీపీ మాత్రం ఆ వాతావరణాన్ని చెడగొట్టేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ వర్కవుట్ కావడం లేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసహనం నెలకొంది. ఆ రెండు పార్టీల కలయిక తమకు ముప్పు తెస్తుందని బలంగా నమ్ముతున్నారు. వారితో పాటు బీజేపీ కూడా కలిసే వెళుతుందని ఎక్కువ మంది వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్ స్టాపబుల్ షోకి అటెండ్ అవుతుండడం.. పొలిటికల్ గా కొన్ని అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. షోకి విపరీతమైన వ్యూయర్ షిప్ ఉండడంతో అవి ప్రజల్లోకి బలంగా వెళతాయని వైసీపీ భావిస్తోంది. అందుకే ముందగా షోపై ఒక రకమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో భాగమే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !