UPDATES  

 జగన్‌ దేశంలోనే ధనిక సీఎం.. కేసుల్లో కేసీఆర్‌ టాప్‌..

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హత, గన్‌ లైసెన్సులు, అత్యధిక వాహనాలు.. ఇలా ఏడు అంశాలకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రముఖ ఇంగ్లిష్‌ వెబ్‌సెట్‌ ‘ది ప్రింట్‌’ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్స్‌ను దీనికి ప్రాతిపదికగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది. Jagan- KCR ధనిక సీఎం జగన్‌.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేవ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.370 కోటు. వారసత్వంగా ఆయనకు అందిన వాటితోపాటు రాజకీయాల్లోకి రాకముందు ఓ పారిశ్రామికవేత్తగా ఆయన ఈ ఆస్తులను సంపాదించారు. స్థిరాస్తుల్లోనూ జగన్‌ టాప్‌లో ఉన్నారు. ఈ కేటగరీో రెండోస్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండు ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.132 కోట్లు పేద ముఖ్యమంత్రి మమత.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ అట్టడుగున నిలిచారు.

ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆమె తరువాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రూ.72 లక్షలు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రూ.56 లక్షలు, కర్ణాటక, హర్యానా ముఖ్యమంత్రు బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రూ.1.37 కోట్లు, రూ.1.27 కోట్లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఆయన ముగ్గురు పెళ్లాల ముఖ్యమంత్రి.. ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో అయిద ుమంది అవివాహితులు ఉన్నారు. మనోహర్‌ లాల్‌ఖట్టర్‌- హర్యానా, నవీన్‌ పట్నాయక్‌- ఒడిశా, యోగి ఆదిత్యనాథ్‌-ఉత్తర ప్రదేశ్, ఎన్‌.రంగస్వామి- పుదుచ్చేరి, మమత బెనర్జీ – పశ్చిమ బెంగాల్‌ అవివాహితులు. సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్‌ బహు భార్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం. క్రిమినల్‌ కేసుల్లో కేసీఆర్‌ టాప్‌.. ముఖ్యమంత్రులందరిలోనూ అత్యధిక క్రిమినల్‌ కేసులు ఉన్నది తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే. ఈ కేటగిరీలో రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ ఉన్నారు. స్టాలిన్‌పై 47 కేసులు నమోదయ్యాయి. వైఎస్‌జగన్‌పైనా చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులు ఉన్నాయి. వాటి సంఖ్య 38. అశోక్‌ గెహ్లాట్‌-రాజస్థాన్, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్, సంగ్మా-మేఘాలయా, రియో-నాగాలాండ్, రంగస్వామిపై ఎలాంటి నేరారోపణలు లేవు. బీజేపీకి చెందిన 10 మంది ముఖ్యమంత్రులు కూడా క్లీన్‌ చిట్‌లో ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !