UPDATES  

 రాఘవేంద్రుడి ‘గ్లామర్’ పండు.! ఏ హీరోయిన్‌తో మొదలైందంటే.!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలనగానే ముందుగా గుర్తుకొచ్చేది హీరోయిన్ బొడ్డు మీద పడే పళ్ళు.! ఔను, అది రాఘవేంద్రరావు ట్రేడ్ మార్క్. కొబ్బరి చిప్పల్ని సైతం వదల్లేదు రాఘవేంద్రరావు. ‘ఆ కొబ్బరి చిప్పల్ని బొడ్డు మీద వేయడం ఏం కళాత్మకత.?’ అంటూ రాఘవేంద్రుడితో కొబ్బరి చిప్పల్ని తన బొడ్డు మీద వేయించుకున్న సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఓ సందర్భంలో సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాప్సీ ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుందనుకోండి.. అది వేరే సంగతి.

ఎలా మొదలైందంటే… వందకు పైగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమాలు తెరకెక్కాయి. వాటన్నిటినీ పరిశీలిస్తే, మెజార్టీ సినిమాల్లో బొడ్డు మీద పండు వ్యవహారం వుంటుంది. ఇది ఎప్పుడు మొదలైంది.? అని ఆరా తీస్తే, చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మంచి దొంగ’ సినిమాతో అది స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ‘బెడ్ లైట్ తగ్గించనా..’ అంటూ సాగే పాటలో విజయశాంతిపై పళ్ళు వేశాడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు . ఫస్ట్ నైట్ సాంగ్ కాబట్టి, కాస్త వెరైటీగా వుండడం కోసం ఈ పాటలో పళ్ళను హీరోయిన్ మీద వేయించాడట దర్శకేంద్రుడు. అద్గదీ అసలు సంగతి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !